ఎన్టీఆర్ సెంటిమెంట్ తో బాల‌య్య‌..

జూనియర్ ఎన్టీఆర్ తో బాలయ్యకు కొన్ని విభేధాలు ఉన్నాయి. ఈ రెండు కుటుంబాలు కలిసి ఉండటం లేదనేది అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఇప్పుడు బాలయ్య ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. అది కూడా అబ్బాయికి.. తనకు కూడా కలిసొచ్చిందే. తన కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకుంటున్నాడు బాలకృష్ణ. అదే జై సింహా.

దీనికి ముందు కర్ణ అనుకున్నారు కానీ ఎందుకో అది బాలయ్యకు నచ్చలేదు. సాఫ్ట్ టైటిల్ గా ఉందని కర్ణను కాదని.. జై సింహాకు ఓకే చెప్పాడు బాలయ్య. పైగా ఇందులో ఈయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దాంతో ఒకరు జై.. మరొకరు సింహాగా రానున్నారు.

ఈ మధ్యే అబ్బాయి జై లవకుశగా వచ్చి అదరగొట్టాడు. ఈ చిత్రం 80 కోట్ల వరకు వసూలు చేసింది. ఇందులో జైగా రప్ఫాడించాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు బాబాయ్ బాలయ్య కూడా జై గా రాబోతున్నాడు. పైగా ఈయనకు సింహా అనే పదం అచ్చొచ్చింది. ఇంకా చెప్పాలంటే సింహానికి బ్రాండ్ అంబాసిడర్ బాలయ్యే.

బొబ్బిలిసింహం.. నరసింహనాయుడు.. సమరసింహారెడ్డి.. లక్ష్మీనరసింహా.. సింహా.. ఇలా సింహాన్ని తీసుకొచ్చిన ప్రతీసారి విజయం అందుకున్నాడు బాలయ్య. మళ్లీ ఇన్నాళ్లకు జై సింహా అంటున్నాడు. ఈ సారి రెండు సెంటిమెంట్లు.. ఒకటి తనది.. రెండు అబ్బాయిది. ఈ రెండు కలిసి కేఎస్ రవికుమార్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాలని చూస్తున్నాడు ఈ సీనియర్ హీరో. సంక్రాంతికి జై సింహా విడుదల కానుంది.

Follow US