ఎన్టీఆర్ పై క్రిష్ డామినేష‌న్..

Last Updated on by

రెండేళ్ల కింద వ‌ర‌కు కూడా క్రిష్ అంటే కేవ‌లం మంచి సినిమాల ద‌ర్శ‌కుడు. ఈయ‌న సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ కావు అనే ఓ అంచ‌నా అయితే ఉండేది. కానీ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో అన్నీ ప‌టాపంచ‌లు చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం 49 కోట్లు వ‌సూలు చేసి క్రిష్ ను క‌మ‌ర్షియ‌ల్ గా కూడా సూప‌ర్ అని నిరూపించింది. ఈ చిత్రం త‌ర్వాత ఇప్పుడు హిందీలో మ‌ణిక‌ర్ణిక సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు క్రిష్. ఇది షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించే బాధ్య‌త‌ను క్రిష్ కు అప్ప‌గించాడు బాల‌కృష్ణ‌.

ఈయ‌న ఒక్క‌సారి ఎవ‌రైనా ద‌ర్శ‌కున్ని న‌మ్మాడంటే మొత్తం అత‌డికే అప్ప‌గిస్తాడు. అయితే ఒక్క ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంలోనే తాను కూడా అన్నింట్లోనూ ఇన్ వాల్వ్ కావాల‌ని ముందు నుంచే త‌యార‌య్యాడు బాల‌య్య‌. ఈ వేలు పెట్ట‌డం న‌చ్చ‌కే తేజ ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్నాడ‌ని వార్త‌లున్నాయి. అయితే తేజ త‌ర్వాత వ‌చ్చిన క్రిష్.. బాల‌య్య చెప్పిన‌ట్లే చేస్తాడనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించాలి అంటే తాను చెప్పిన‌ట్లుగా మార్పులు చేయాలి.. వినాలి అనే కండీష‌న్ ముందే బాల‌య్య‌కు క్రిష్ పెట్టాడ‌ని తెలుస్తుంది.

క్రిష్ పై ఉన్న న‌మ్మ‌కంతో బాల‌య్య కూడా ఏం మాట్లాడ‌టం లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దానికి త‌గ్గ‌ట్లే క్రిష్ రాగానే ప్రీ ప్రొడ‌క్ష‌న్ లో వేగం పెరిగింది. దానికితోడు న‌టీన‌టుల ఎంపిక‌లో కూడా క్యాస్టింగ్ కాల్ ఇచ్చాడు క్రిష్. ఇందులో బాల‌య్య కూడా త‌న వంతు పాత్ర పోషిస్తున్నా ఫైన‌ల్ కాల్ మాత్రం క్రిష్ దే అని తెలుస్తుంది. సినిమాకు అన్నీ తానే ద‌గ్గ‌రుండి చూసుకుంటాన‌ని.. త‌న‌ను న‌మ్మాలంటూ బాల‌య్య‌ను క్రిష్ కోరిన‌ట్లుగా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న మాట‌. అక్టోబ‌ర్ లో ప‌ట్టాలెక్క‌బోయే ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. క్రిష్ డామినేష‌న్ ఎన్టీఆర్ పై ఎలా ఉండ‌బోతుందో..?

User Comments