జై సింహా సంక్రాంతి హిట్టే

Last Updated on by

సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల‌న్నీ చేతులెత్తేసినా.. తానున్నానంటూ పండ‌గ ప‌రువు కాపాడాడు బాల‌య్య‌. ఈయ‌న న‌టించిన జై సింహా యావ‌రేజ్ టాక్ తోనే వ‌సూళ్లు సాధిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. షేర్ 28 కోట్ల‌కు పైగానే వ‌చ్చింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని 27 కోట్ల‌కు అమ్మారు నిర్మాత సి క‌ళ్యాణ్. ఇప్పుడు ఆ మొత్తం వెన‌క్కి వ‌చ్చేసింది. ఓవ‌ర్సీస్ లో ఇంకా రావాల్సి ఉన్నా.. మిగిలిన ఏరియాల్లో అంత కంటే ఎక్కువే తీసుకొచ్చింది. దాంతో జై సింహా 2018 తొలి హిట్ గా నిలిచింది. అయితే బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం కాదు ఈ చిత్రం.

ఇప్ప‌టి వ‌ర‌కు 51 కోట్ల గ్రాస్.. 28 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ సెలెబ్రేష‌న్స్ చేసుకున్నారు. బాల‌య్య‌తో పాటు చిత్ర‌యూనిట్ అంతా ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. ఎందుకో తెలియ‌దు కానీ జై సింహాను ముందు నుంచే చాలా త‌క్కువ హైప్ తో తీసుకొచ్చారు. పైగా బిజినెస్ కూడా చాలా త‌క్కువ‌గా చేసారు. బాల‌య్య గ‌త సినిమా పైసావ‌సూల్ 32 కోట్ల బిజినెస్ చేస్తే.. జై సింహా 27 కోట్లకే ప‌రిమితం అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం కూడా అతి క‌ష్టం మీద తీసుకొచ్చింది జై సింహా. అయితే ఈ వారం భాగ‌మ‌తి త‌ప్ప మ‌రో సినిమా లేకపోవ‌డంతో మూడో వారం కూడా బాల‌య్య‌కే రాసిచ్చేలా ఉన్నారు ప్రేక్ష‌కులు. ఇదే జ‌రిగితే హిట్ నుంచి సూప‌ర్ హిట్ రేంజ్ కు జై సింహా వెళ్ల‌డం ఖాయం. ఏదేమైనా ప‌వ‌న్ నిరాశ ప‌ర‌చ‌డంతో పండ‌గ చేసుకుంటున్నాడు బాల‌య్య‌.

Follow US 

User Comments