బాల‌య్య ఇంట నంది వ‌ర్ధ‌నం..

బాల‌య్య ఇంటికి నంది న‌డుచుకుంటూ వ‌చ్చింది. కెరీర్ లో మూడోసారి ఉత్త‌మ న‌టుడిగా నందిని అందుకున్నాడు బాల‌కృష్ణ‌. ఈయ‌న న‌టించిన లెజెండ్ చిత్రానికి గానూ నంది అవార్డు అందించింది ఏపీ ప్ర‌భుత్వం. 2014 నంది అవార్డులు ప్ర‌క‌టించారు ప్ర‌భుత్వం. అందులో లెజెండ్ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్త‌మ న‌టుడిగా బాల‌య్య‌.. ద‌ర్శ‌కుడిగా బోయ‌పాటి.. విల‌న్ గా జ‌గ‌ప‌తిబాబు అవార్డులు అందుకున్నారు. కాగా ఇది బాల‌య్య కెరీర్ లో మూడో నంది అవార్డ్. ఇదివ‌ర‌కు కూడా బోయ‌పాటి తెర‌కెక్కించిన సింహా చిత్రంలో న‌ట‌న‌కు గానూ ఉత్త‌మ న‌టుడిగా నందిని సొంతం చేసుకున్నాడు బాల‌కృష్ణ‌. అంత‌కుముందు 2001లో న‌రసింహనాయుడు సినిమాకు కూడా తొలిసారి ఉత్త‌మ న‌టుడిగా నంది పుర‌స్కారం అందుకున్నాడు. మొత్తానికి యాక్ష‌న్ ఫ్యాక్ష‌న్ క‌ల‌గ‌లిపిన సినిమాల్లోనే త‌న అస‌లైన న‌ట‌న బ‌య‌టికి తీస్తున్నాడు న‌ట‌సింహం. బాల‌య్య‌కు నంది అవార్డ్ రావ‌డంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Follow US