బాలయ్య ధుర్యోధ‌నుడిగా ఎంట్రీ

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఓపెనింగ్ కు రామ‌కృష్ణ స్టూడియోస్ స‌ర్వంగ సుంద‌రంగా ముస్తాబైంది. బాల‌య్య హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంపై అంచ‌నాలు ఆకాశ‌మంత ఎత్తులో ఉన్నాయి. తండ్రి బ‌యోపిక్ కావ‌డంతో బాల‌య్య కూడా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. నిర్మాత‌గానూ మారిపోయాడు ఈ చిత్రంతో.  ఈ సినిమా ఓపెనింగ్ కు ఇండ‌స్ట్రీ మొత్తం క‌దిలివ‌చ్చింది. నంద‌మూరి కుటుంబం కూడా చాలా కాలం త‌ర్వాత ఓకే వేదిక‌పై క‌నిపిస్తున్నారు. వినాయ‌క్.. తేజ‌.. సుకుమార్ తో పాటు ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కులంతా ఈ ఓపెనింగ్ కు వ‌చ్చారు.Balakrishna No Appearance in NTR BIopic Movie Openingఎంతో మంది ప్రముఖులు వచ్చారు అయినా సరే బాలకృష్ణ మాత్రం ఆ ప్రాంగణంలో క‌నిపించ‌లేదు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. బాల‌య్య స‌ప‌రేట్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ఉ. 9.42 నిమిషాల‌కు ఈ చిత్ర ముహూర్తం కాబట్టి అదే టైంకి బాల‌య్య ధుర్యోధ‌నుడి గెట‌ప్ లో ఎంట్రీ ఇచ్చాడు. దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌లోని ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ తోనే ముహూర్తం షాట్ ప్లాన్ చేసారు. రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్ట్ నుంచి మొద‌లు కానుంది. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలి.. పెద్దాయ‌న‌గా బాల‌య్య ఎలా రెచ్చిపోనున్నాడో..?Balakrishna No Appearance in NTR BIopic Movie Opening