Last Updated on by
సడన్ గా మళ్లీ ఆ అనుమానం ఏంటి..? ఇప్పటికే అంతా సిద్ధమైంది కదా.. బాలీవుడ్ నుంచి విద్యాబాలన్ ను కూడా తీసుకొస్తున్నారు.. ఇంక ఏం అనుమానం అనుకుంటున్నారా..? ఏమో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందేమో అనే టెన్షన్ అందర్లోనూ ఉంది. ఈ చిత్రం తెరకెక్కించాలంటే చాలా గట్స్ ఉండాలి.. ఎందుకంటే ఎన్టీఆర్ లైఫ్ లో ఎంత వెలుగు ఉందో.. అంతే చీకటి కూడా ఉంది. అయితే కేవలం వెలుగు మాత్రమే చూపిస్తాం అంటే కుదరదు. కానీ చీకటిని చూపిస్తే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో కొందర్ని కచ్చితంగా ప్రతినాయకులను చేయాలి. అందులో ఎన్టీఆర్ కు కావాల్సిన వాళ్లున్నారు.. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర పోషించనున్న బాలయ్యకు బంధువులు కూడా ఉన్నారు. పోనీ అలా కాకుండా కేవలం ఎన్టీఆర్ గెలుపు మాత్రమే చూపిస్తాం అంటే మాత్రం కచ్చితంగా ప్రేక్షకుల నుంచి విమర్శలు తప్పవు. దాంతో ఇప్పుడు క్రిష్ ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డాడు. దానికితోడు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావ్ కుటుంబం నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి లీగల్ నోటీసులు కూడా వెళ్లాయి. ఇన్ని అడ్డంకుల మధ్య ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పటికి మొదలవుతుంది.. ఎప్పుడు పూర్తవుతుంది..?
User Comments