జై సింహా.. అప్పుడే ఫైన‌ల్ షెడ్యూలా..?

బాల‌య్య ఏం చేసినా ఎక్స్ ట్రీమ్ లెవ‌ల్లో ఉంటుంది. ఈయ‌న వ‌య‌సు 60కి చేరువైంది కానీ మ‌న‌సు మాత్రం ఇంకా 20ల్లోనే ఆగిపోయింది. అందుకే ఆయ‌న‌లో అంత జోరు క‌నిపిస్తుంటుంది. లేక‌పోతే మ‌రేంటి.. ఇప్ప‌టికీ సినిమా సినిమాకు ఆయ‌న వేస్తోన్న డాన్సులు.. చేస్తోన్న యాక్ష‌న్ స్టంట్లు చూస్తుంటే దుమ్ము లేసిపోతుంది.. మ‌తులు చెడిపోతున్నాయి. అస‌లు బాల‌య్య జోరుకు కార‌ణ‌మేంటో తెలుసుకోడానికి చాలా మంది ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఈయ‌న కేఎస్ ర‌వికుమార్ జై సింహా సినిమా కోసం ర‌ప్ఫాడిస్తున్నాడు. జై పాత్ర‌లో.. సింహాగా మ‌రో పాత్ర‌లో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు బాల‌య్య.

ఈ మ‌ధ్యే నంది అవార్డుల‌తో పాటు పార్టీ కార్య‌క్ర‌మాల్లో కూడా పాల్గొన్నాడు బాల‌కృష్ణ‌. ఇక ఇప్పుడు మ‌ళ్లీ సినిమా మూడ్ లోకి రానున్నాడు. జై సింహా చివ‌రి షెడ్యూల్ న‌వంబ‌ర్ 22 నుంచి డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు హైదరాబాద్ లో జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పూర్తి కానుంది. ఈ ఏజ్ లో ఈ జోరేంటో అని మిగిలిన హీరోలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా పూర్తి చేస్తున్నాడు బాల‌య్య‌. జ‌న‌వ‌రి 12న జై సింహా విడుదల కానుంది. ఈ చిత్ర బిజినెస్ కూడా 40 కోట్ల‌కు దాటేసి.. 50 కోట్ల వైపుగా ప‌రుగులు తీస్తుంది. సంక్రాంతి విడుద‌ల సినిమాకు క‌లిసి రానుంది.

ఈ చిత్రాన్ని కేఎస్ ర‌వికుమార్ తెర‌కెక్కిస్తుండ‌గా.. సి క‌ళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. ఎంతైనా బాల‌య్య సినిమా అంటే ఒక్క‌రుంటే స‌రిపోదు. ఇప్ప‌టికే జై సింహాలో న‌య‌న‌తార మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఈ భామ‌పై కొన్ని స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు ర‌వికుమార్. ఇక మ‌ధ్య‌లో న‌టాషా అనే మ‌రో హీరోయిన్ ఎంట‌రైంది. ఇక మ‌రో బాల‌య్య‌కు జోడీగా హ‌రిప్రియ న‌టిస్తుంది. వీళ్లిద్ద‌రి స్టిల్స్ కూడా విడుద‌ల‌య్యాయి. పిల్ల‌జ‌మీందార్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా న‌టించిన హ‌రిప్రియ‌.. త‌ర్వాత క‌నిపించ‌లేదు. ఇన్నాళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ బాల‌య్య సినిమాలో న‌టిస్తుంది.

Follow US