రిప‌బ్లిక్ డే ని ఎవరు క్యాష్ చేసుకొంటారు?

అదృష్టం అంటే ఇలా క‌లిసిరావాలి. సంక్రాంతి సినిమాగా విడుద‌లై రిప‌బ్లిక్ డే సినిమాగా కూడా బాల‌య్యే ఉండ‌బోతున్నాడు. సంక్రాంతికి వ‌చ్చిన జై సింహా ఇప్ప‌టికే సేఫ్ జోన్ కు వ‌చ్చి 2018లో తొలి విజ‌యంగా నిలిచింది. ఈ చిత్రం 30 కోట్ల‌కు పైగానే షేర్ వ‌సూలు చేసింది ఇప్ప‌టి వ‌ర‌కు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి మ‌రో వ‌రం ల‌భించింది. అదే జ‌న‌వ‌రి 26 వీకెండ్. మూడు రోజుల వీకెండ్ కు భాగ‌మ‌తి మాత్ర‌మే విడుద‌ల‌వుతుంది. నిజానికి ఈ వారం మ‌రో మూడు నాలుగు సినిమాలు రావాల్సి ఉన్నా ఏదీ రావ‌ట్లేదు. దాంతో భాగ‌మ‌తి మాత్ర‌మే ఈ ఒక్క వీకెండ్ క్యాష్ చేసుకోవ‌డం క‌ష్టమే. అందుకే అనుష్క‌కు బాల‌య్య కూడా సాయం చేస్తున్నాడు. ఇప్ప‌టికే పాజిటివ్ టాక్ ఉన్న సినిమా కావ‌డంతో భాగ‌మ‌తికి ఏ చిన్న తేడా జ‌రిగినా జ‌న‌మంతా బాల‌య్య‌కు జై కొట్ట‌డం ఖాయం. ఇదే జ‌రిగితే హిట్ కాస్తా సూప‌ర్ హిట్ అవుతుంది జై సింహా. మ‌రి ఏం జ‌రుగుతుందో..? భాగ‌మ‌తి ఏం చేస్తుందో..?