సి క‌ళ్యాణ్ కు బాల‌య్య వార్నింగ్..

అదేంటి.. నిర్మాత‌ల‌ను బాల‌య్య చాలా బాగా చూసుకుంటాడు క‌దా.. అలాంటిది త‌న నిర్మాత‌కు ఎందుకు వార్నింగ్ ఇచ్చిన‌ట్లు అనుకుంటున్నారా.. అవును.. బాల‌య్య నిర్మాత బాగు కోరే హీరోనే..! అందుకే ఆయ‌న్ని ద‌ర్శ‌కుల హీరో.. నిర్మాత‌ల హీరో అంటారు. నిర్మాత బాగుంటేనే ఇండ‌స్ట్రీ బాగుంటుంది అని న‌మ్మే హీరో ఈయ‌న‌. ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నాడు నంద‌మూరి న‌ట‌సింహం. తాజాగా గ‌రుడ‌వేగ ట్రైల‌ర్ లాంఛ్ కు వ‌చ్చిన బాల‌య్య‌.. నిర్మాత‌ల గురించి మాట్లాడాడు. ఓ సినిమాను అనుకున్న టైమ్ కంటే ముందే పూర్తి చేస్తే నిర్మాత‌ల‌కు చాలా లాభం చేసిన వాళ్లం అవుతామ‌ని.. నిర్మాత బాగుంటేనే సినిమా ఇండ‌స్ట్రీ కూడా బాగుంటుంద‌ని చెప్పాడు బాల‌కృష్ణ‌.

అందుకే తాను ప్ర‌స్తుతం ప‌ని చేస్తోన్న సి క‌ళ్యాణ్ కు కూడా ఇదే వార్నింగ్ ఇచ్చిన‌ట్లు చెప్పాడు బాల‌య్య‌. కెఎస్ ర‌వికుమార్ సినిమాను అనుకున్న దానికంటే ఒక రోజు ముందే పూర్తి చేయాల‌ని చూస్తున్న‌ట్లు చెప్పాడు బాల‌కృష్ణ‌. ఈ ఏడాది ఆయ‌న న‌టించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి కేవ‌లం 79 రోజ‌ల్లో పూర్త‌యింది.. ఇక పైసావ‌సూల్ అయితే 78 రోజుల్లో పూర్తి చేసాడు. ఈ చిత్రాన్ని చెప్పిన తేదీ కంటే నెల రోజుల ముందే విడుద‌ల చేసాడు బాల‌య్య‌. ఇలా ప‌క్కాగా డేట్స్ ఇస్తూ.. నిర్మాత‌ల‌కు ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నాడు బాల‌కృష్ణ‌. ఈయ‌న మాదిరే ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలంతా ఆలోచిస్తే ఏడాదికి క‌నీసం స్టార్స్ నుంచి 20 సినిమాలు వ‌స్తాయి. అలా జ‌రిగితే నిర్మాత‌ల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా బాగుప‌డుతుంది క‌దా..!