క‌మెడియ‌న్‌కి బాల‌య్య వార్నింగ్.. నిజం ఇదీ

Last Updated on by

హైప‌ర్ ఆది ఇటీవ‌ల మ‌ళ్లీ జ‌బ‌ర్ధ‌స్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ యంగ్ ట్యాలెంటు రావ‌డం రావ‌డ‌మే ఓ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. కొన్ని నెల‌ల క్రితం బాల‌కృష్ణ‌ను కించ‌ప‌రిచేలా ఆది ఓ స్కిట్ చేసాడ‌ని, అది న‌చ్చ‌ని బాల‌య్య ఆదిని ఇంటి కి పిలిపించి మ‌రీ వార్నింగ్ ఇచ్చాడ‌ని వార్త‌లొచ్చాయి. అప్ప‌టి నుంచి ఆది  నంద‌మూరి ఫ్యామిలీకి సంబంధించిన స్కిట్ ల స్పీడ్ త‌గ్గించాడ‌ని అంటుంటారు. తాజాగా ఆ రూమ‌ర్లపై ఆది క్లారిటీ  ఇచ్చాడు. బాల‌కృష్ణ గారు న‌న్ను ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చార‌ని వ‌చ్చిన‌ వార్త‌ల‌న్ని అవాస్త‌వాలే. క‌ల్పిత రాత‌లే. ఆయ‌న నాకెందుకు  వార్నింగ్ ఇస్తారు? అంత అవ‌స‌రం ఏముంది? అంత‌గా మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఎవ‌రి మీద స్కిట్ లు చేయ‌లేదు.

అదిరే అభి టీమ్ లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ గెట‌ప్  వేయ‌డంతో  ఓ అభిమాని ఫోన్ చేసి అభిని బెదిరించాడు. ఆ విష‌యాన్ని ఓ ఇంటర్వూలో నేను చెప్ప‌డంతో దాన్ని మార్చి బాల‌కృష్ణ గారు నాకు వార్నింగ్ ఇచ్చార‌ని రాసారు. ఇవి కావాల‌ని ఎవ‌రో క‌ల్పించిన వార్తలు త‌ప్ప‌.. అలాంటిదేం లేద‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం ఆది కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగిపోతుంది. టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో కూడా అవ‌కాశాలు  ఒడిసి ప‌ట్టుకుంటున్నాడు.  వేదిక ఏదైనా ట్యాలెంట్ ను  బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

User Comments