తేజ పోయి క్రిష్ వ‌చ్చే ఢాం ఢాం ఢాం..!

Last Updated on by

చిన్న‌పుడు మనం చ‌దువుకున్న పాఠం గుర్తుండే ఉంటుంది క‌దా..! క‌త్తి పోయి క‌ట్టె వ‌చ్చే.. క‌ట్టే పోయి గ‌డ్డి వ‌చ్చే ఇలా ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి తేజ పోయి క్రిష్ వ‌చ్చె అన్న‌మాట‌. తండ్రి బ‌యోపిక్ కు ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌బ్బా అని చూసి చూసి త‌న‌కు ఇష్ట‌మైన ద‌ర్శ‌కున్ని తెచ్చుకున్నాడు బాల‌య్య‌. త‌న‌కు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి లాంటి అద్భుత‌మైన సినిమాను కానుక‌గా ఇచ్చిన క్రిష్ నే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నాడు. ఈ క‌థ‌లో త‌న‌కు కావాల్సిన మార్పులు చేసుకోడానికి కూడా అనుమ‌తి ఇచ్చాడు బాల‌కృష్ణ‌. ప్ర‌స్తుతం ఈయ‌న మ‌ణిక‌ర్ణిక సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తైన వెంట‌నే ఎన్టీఆర్ సినిమాపై దృష్టి పెడ‌తాడు.

అన్న‌ట్లు ఇప్పుడు క్రిష్ కేరాఫ్ బ‌యోపిక్స్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. శాత‌క‌ర్ణి బ‌యోపిక్ త‌ర్వాత ఇప్పుడు ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్ చేస్తున్నాడు. ఇది ఇలా పూర్తైందో లేదో ఇప్పుడు పెద్దాయ‌న బ‌యోపిక్ వైపు అడుగేస్తున్నాడు. ఈ చిత్రం క్రిష్ కెరీర్ లో కీల‌కం. అన్న‌గారి బ‌యోపిక్ గానీ అర్థ‌మ‌య్యేలా అద్భుతంగా తీసాడంటే క్రిష్ పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోవ‌డం ఖాయం. బాల‌కృష్ణ ప్ర‌స్తుతం వినాయ‌క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్ ప‌ట్టాలెక్కిస్తాడు. మే 28న ఎన్టీఆర్ జ‌యంతి కానుక‌గా ఒక రోజు ముందే తండ్రి సినిమాపై క్లారిటీ ఇచ్చాడు నంద‌మూరి వార‌సుడు.

User Comments