రాజ‌శేఖ‌ర్ ఏదో చేస్తున్నాడు..

నేనున్నాను.. రాజ‌శేఖ‌ర్ కు ప‌ర్ ఫెక్ట్ గా స‌రిపోయే టైటిల్ ఇది. అవును.. తాను అనే ఓ హీరోను ఉన్నానంటూ ప్రేక్ష‌కుల‌కు.. ఇండ‌స్ట్రీకి గుర్తు చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు రాజ‌శేఖ‌ర్. ఒక‌ప్పుడు నేను ఇది అనే చ‌రిత్ర ఇప్పుడు అన‌వ‌స‌రం. ప్ర‌స్తుతం నువ్వేంటి అనే వ‌ర్త‌మాన‌మే అంద‌రికీ కావాలి. ఆ గ‌తం ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ కు ప‌నికిరాదు.. అందుకే భ‌విష్య‌త్తు కోసం ప్ర‌స్తుతాన్ని బాగు చేసుకుంటున్నాడు ఈ హీరో. అస‌లు రాజ‌శేఖ‌ర్ సినిమా వ‌చ్చి వెళ్తోన్న సంగ‌తి కూడా తెలియ‌ని ఈ టైమ్ లో గ‌రుడ‌వేగ మాత్రం ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఈ చిత్రాన్ని ప్ర‌వీణ్ స‌త్తార్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ సీక్రేట్ ఏజెంట్ గా న‌టిస్తున్నాడు. ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా సొంత నిర్మాణంలోనే సినిమాలు చేస్తోన్న రాజ‌శేఖ‌ర్.. చాలా ఏళ్ల త‌ర్వాత బ‌య‌టి నిర్మాత‌ల‌తో ప‌ని చేస్తున్నాడు.
గ‌రుడ‌వేగ‌ కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నారు, ప్రొడ్యూసర్ కి ఏ న‌మ్మ‌కం ఉందో తెలియ‌దు కానీ సినిమాపై 25 కోట్లు పెట్టారని తెలుస్తోంది. ఫారెన్ షూటింగ్ లు.. స‌న్నీలియోన్ ఐటం సాంగ్.. హై టెక్నిక‌ల్ కెమెరాలు.. విదేశీ టెక్నీషియ‌న్లు.. ఇలా ప్ర‌వీణ్ స‌త్తారు చేస్తున్న ర‌చ్చ మామూలుగా లేదు. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే సినిమాపై అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ బాల‌య్య చేతుల మీదుగా విడుద‌ల కానుంది. ఇదంతా చూస్తుంటే అస‌లు ఇప్పుడు మ‌నం చూస్తున్న‌ది రాజ‌శేఖ‌ర్ సినిమానా లేదంటే మ‌రో హీరోనా అనిపించ‌క మాన‌దు. త‌న‌తో ఇంత బ‌డ్జెట్ పెట్టారా అని రాజ‌శేఖ‌ర్ కూడా క‌న్ఫ్యూజ్ అవుతున్నాడిప్పుడు. సినిమా ఎంత బాగున్నా ఇప్పుడు రాజశేఖ‌ర్ ఉన్న ప‌రిస్థితుల్లో ఈ చిత్రం అన్ని కోట్లు వ‌సూలు చేస్తుందా..? ఏదేమైనా ఇప్పుడు గ‌రుడ‌వేగ మాత్రం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.