జ‌న‌వ‌రిలో బాల‌య్య బంతాట‌

Last Updated on by

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్ అంటేనే య‌మ‌క్రేజు. ఈ జోడీ సింహా, లెజెండ్ చిత్రాల‌తో కెరీర్ బెస్ట్ హిట్స్ అందుకున్నారు. ఆ క్ర‌మంలోనే ఈ కాంబోలో తెర‌కెక్కే హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఆ మ‌ధ్య నా ద‌ర్శ‌కులంతా అన్నీ రొటీన్ క‌థ‌లు చెబుతున్నారంటూ బాల‌య్య పూర్తిగా క్రిష్ వైపు మొగ్గు చూపి బోయ‌పాటిని దూరం పెట్టేశాడ‌ని అన్నారు. అయితే పూరి `పైసా వ‌సూల్‌` ఇచ్చిన ఝ‌ల‌క్‌తో మ‌రోసారి బోయ‌పాటి బెస్ట్ అన్న ఆలోచ‌న‌కు బాల‌య్య వ‌చ్చార‌ని ప్ర‌చార‌మైంది. ఇక‌పోతే క్రిష్ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో నంద‌మూరి కాంపౌండ్‌లో ప‌ర్మినెంట్ డైరెక్ట‌ర్‌గా సెటిల‌య్యాడు. ఇక వేరొక ద‌ర్శ‌కుడు వినాయ‌క్ ప్ర‌య‌త్నం ఇంత‌వ‌ర‌కూ స‌ఫ‌లం కానేలేదు. బాల‌య్య‌తో అత‌డి సినిమా అంత‌కంత‌కు వాయిదా ప‌డుతూనే ఉంది. ఆ క్ర‌మంలోనే సింహ‌మంటి చిన్నోడు బోయ‌పాటి తెలివిగా పావులు క‌దిపి బాల‌య్య‌తో సెట్స్‌కెళ్లేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. ఓవైపు చ‌ర‌ణ్ సినిమాని వేగంగా పూర్తి చేస్తూనే న‌ట‌సింహాకు పెద్ద లెవల్లో స్కెచ్ వేశాడు.

ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేసేవాడే మొన‌గాడిక్క‌డ‌. ఆ కోవ‌లో చూస్తే బోయ‌పాటి మొన‌గాడే. చాలా ముందే బాల‌య్య కోసం ప్లాన్ సిద్ధం చేసుకుని చ‌క్క‌ని యాక్ష‌న్‌ క‌థ‌తో ఒప్పించాడు. ఇక ఏమైందో ఏమో కానీ బాల‌య్య బర్త్ డే కానుక‌గా జూన్ 10 లాంచ్ కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా ప‌డింది. ఇక తిరిగి ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో ప్రారంభించి 60రోజుల షెడ్యూల్‌లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేయాల‌ని బోయ‌పాటి డిసైడ్ అయ్యాడ‌ట‌. లాంచ్ ఆల‌స్య‌మైనా కంటిన్యువ‌స్ షెడ్యూల్‌లో బాల‌య్య అకౌంట్ క్లియ‌ర్ చేయాల‌న్న‌ది బోయ‌వారి ప్లాన్‌. అలానే 2019 ఎన్నిక‌ల ముందే సినిమా రిలీజ్ చేస్తే అది త‌న‌కు లాభిస్తుంద‌న్న ఆలోచ‌న అత‌డికి ఉందిట‌. ఇక సంక్రాంతికి చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమా ఎలానూ రిలీజైపోతుంది కాబ‌ట్టి అట్నుంచి త‌న‌పై ప్రెజ‌ర్ ఉండ‌ద‌న్న‌ది క్లియ‌ర్‌. అప్ప‌టికి ఎన్టీఆర్ బ‌యోపిక్ రిలీజ్ చేసి బాల‌య్య ప్రీ అయిపోతాడు. అద్గ‌ద‌న్న‌మాట అస‌లు సంగ‌తి.

User Comments