నిర్మాతగా బాల‌య్య చిన్న కుమార్తె!

మోహ‌న్ బాబు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ నుంచి వార‌సురాళ్లు తెరంగేట్రం చేసారు కానీ నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మాత్రం ఏ ఒక్క‌రు సినిమా రంగం వైపు రాలేదు. ముఖ్యంగా బాల‌య్య కూతుళ్లు బ్రాహ్మిణి, తేజ‌స్వీని హ‌రోయిన్ మెటిరియ‌ల్స్. కానీ పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డిపోయారు. బాల‌య్య కు ఇష్టం లేక ఇటువైపు ప్ర‌య‌త్నాలు చేయ‌లేదా? లేక వాళ్ల‌కే ఆస‌క్తి లేదా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. తాజాగా వాట‌న్న‌టింని బాల‌య్య చిన్న‌ల్లుడు, తేజ‌స్వీని భ‌ర్త భ‌ర‌త్ నివృతి చేసాడు.

తెలుగు సొసైటీలో అమ్మాయిలు సినిమాల రంగంలో ఎంకరేజ్ చేయడం తక్కువ. కానీ ఈ జనరేషన్లో వస్తున్నారు. మోహన్ బాబుగారి అమ్మాయి లక్ష్మిగారు, నాగబాబు గారి అమ్మాయి నిహారిక వ‌చ్చారు. అక్కాచెల్లెళ్లు బ్రాహ్మణి, తేజస్విని చాలా అందంగా ఉంటారు, యాక్టింగ్ చేసే కెపాసిటీ ఉంది. వ‌స్తే పెద్ద హీరోయిన్లు అయ్యేవారు అనే వాదన ఉంది. కానీ రాలేదు. వాళ్లు కూడా ప్ర‌య‌త్నించ‌లేదు. నా భార్య తేస్వీనికి సినిమాలంటే ఆసక్తే. న‌టించాల‌ని లేక‌పోయినా ఈ రంగంలో రాణించాల‌నుకుంటోంది. భ‌విష్య‌త్ లో నిర్మాత‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే వాళ్ల నాన్న‌తోనే సినిమాలు చేస్తుదేమోన‌ని న‌వ్వేసాడు.