బాలయ్యతో హాట్ బ్యూటీ పర్సనల్ బాండింగ్

Balayya Dinner Date hot beauty Kyra Dutt
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యతో ఐటమ్ సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ లో నటించడానికి హాట్ బ్యూటీ కైరా దత్ ను తీసుకున్నారని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ సెక్సీ బ్యూటీ బాలీవుడ్ లో కేలండర్ గాళ్స్ తో పాపులర్ అయింది. అలాగే తెలుగులో కూడా ఇప్పటికే రేసుగుర్రం సినిమాలో బూచాడే బూచాడే అంటూ ఓ ఐటమ్ సాంగ్ కూడా చేసింది.
అయితే, ఎప్పుడూ లేనిది ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు బాలయ్యతో నటిస్తూ.. బాలయ్య గురించి చాలా గొప్పగా పేజీల పేజీలు చెప్పేస్తుండటం ఇంట్రెస్టింగ్ మేటర్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే, తాజాగా కైరా దత్ మాట్లాడుతూ.. బాలయ్య చాలా ప్రొఫెషనల్ అని, బాలీవుడ్ లో కూడా ఇలాంటి వారిని చూడలేదని, ఎంతో గౌరవం ఇస్తారని, నాతో తెలుగు బాగా మాట్లాడించింది కూడా ఆయనేనని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా డైలాగుల్లో ఎక్కడ ఆపాలి ఎక్కడ ఎక్స్ ప్రెషన్ పలికించాలి అనేది ఆయన స్వయంగా చెప్పేవారని, ఆయన వలనే డైలాగ్స్ చాలా బాగా చెప్పానని బాలయ్యను కైరా దత్ ఓ రేంజ్ లో మోసేసింది.
ఇక్కడితో ఆపితే బాగుండేదేమో.. కానీ తాజాగా ఈ హాట్ బ్యూటీ బాలయ్యతో కలిసి డిన్నర్ కు కూడా వెళ్లడం ఇప్పుడు సంథింగ్ స్పెషల్ న్యూస్ అనే అనాలి. ఈ సందర్బంగా బాలయ్య మనస్సు బంగారమని, అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం తన అదృష్టమని, తాజాగా షూటింగ్ పూర్తయిన సందర్భంగా తాను ఆయనతో కలిసి ఇలా డిన్నర్ కు వచ్చానని కైరా దత్ చెబుతుందంటేనే అమ్మడు బాండింగ్ ఏ లెవెల్ లో ఉందో తెలుస్తోంది. మొత్తంగా బాలయ్య డైలాగ్స్ నేర్పి టీచర్ కూడా మారితే.. హాట్ బ్యూటీ కైరా దత్ ఇలా డిన్నర్ కు కూడా తీసుకెళ్లడం విశేషమనే అనాలి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ కూడా మా బాలయ్య మనస్సు బంగారమని, అది తెలిస్తే ఎవరైనా ఆయనతో స్నేహంగా ఉండాలని కోరుకుంటారని చెబుతున్నారు.