బాలయ్య అలా… కొత్త సినిమా కోస‌మే

గెట‌ప్పులు మార్చ‌డంలో బాల‌కృష్ణ కూడా ముందుంటారు. ప్ర‌తి సినిమాకీ ఆయ‌న ఒక కొత్త అవ‌తారంలో క‌నిపిస్తుంటారు. ఆయన చాలా వ‌ర‌కు తెర‌పై ద్విపాత్రాభిన‌యాలతో క‌నిపిస్తుంటారు. దాంతో సహ‌జంగానే ఒకొక్క‌పాత్ర‌కి ఒక్కో గెట‌ప్పు అవ‌స‌రం అవుతుంటుంది. మ‌రి త‌దుప‌రి సినిమాలో బాల‌య్య ఎన్ని పాత్ర‌ల్లో క‌నిపిస్తాడో తెలియ‌దు కానీ… ఆయ‌న లుక్కు మాత్రం మారిపోయింది. గుండు చేయించుకున్నారు. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం కోస‌మే ఆయ‌న అలా మారిపోయార‌ట‌. తాజాగా ఆ లుక్కు బ‌య‌టికొచ్చింది. అది చాలా కొత్త‌గా ఉంది. బాల‌కృష్ణ ఎప్పుడూ అంత కొత్త లుక్కులో క‌నిపించ‌లేదు. దాంతో ఆ బాల‌య్య న్యూ లుక్ ఇండ‌స్ట్రీలోనూ, అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Balayya Spotted in A Superb Mass Avatar