ఆ నిర్మాత‌కు బాల‌య్య‌తో ఛాన్స్ అలా?

ద్వార‌కా క్రియేష‌న్స్ అధినేత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి- బోయ‌పాటి శ్రీను- బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. మ‌రి యంగ్ ప్రొడ్యూస‌ర్ కి బాల‌య్య తో సినిమా నిర్మించే అవ‌కాశం ఎలా అంటే? బోయ‌పాటి ద్వారానే వ‌చ్చింద‌ని అంటున్నారు. గ‌తంలో బోయ‌పాటి ద్వార‌కా క్రియేష‌న్స్ లో బెల్లంకొండ త‌న‌యుడు శ్రీనివాస్ తో జ‌య జాన‌కి నాయ‌క అనే సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు హీరో మార్కెట్ ను మించి 40 కోట్లు ఖ‌ర్చు చేసారు. కానీ సినిమా విజ‌యం సాధించ‌లేదు. దీంతో నిర్మాత‌కు భారీగా న‌ష్టాలు వ‌చ్చాయి.

ఆ విష‌యాన్ని మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి బాహాటంగానే మీడియా స‌న్నిహితుల‌తో అన్నాడు. ఆ ప్లాప్ త‌ర్వాత ర‌వీందర్ రెడ్డి సినిమా నిర్మాణంలో జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. ప‌రిశ్ర‌మ‌లో లొసుగుల‌ను క‌నిపెట్టాడు. మొద‌ట‌ల్లో చూపించినంత ఉత్సాహం త‌ర్వాతి కాలంలోచూ పించ‌లేదు. అయితే జ‌యజాన‌కికి వ‌చ్చిన కొంత న‌ష్టాన్నైనా పూరించాలి అన్న ఉద్దేశంతోనే బోయ‌పాటి ర‌వీందర్ రెడ్డికి బాల‌య్య‌తో సినిమా అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు స‌న్నిహితుల ద్వారా తెలిసింది. వాస్త‌వానికి ఈ సినిమాను నిర్మించ‌డానికి బాల‌య్య ముందుకు ప‌లువురు నిర్మాత‌లు వ‌చ్చారుట‌. కానీ బోయ‌పాటి ప‌ట్టు బ‌ట్ట‌డంతోనే ర‌వీంద‌ర్ రెడ్డికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు చెబుతున్నారు.