బాలయ్యను మహేష్ తో పోలుస్తున్నారే..?

పూరీ.. మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. పోకిరి సినిమా అయితే టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిందనే అనాలి. అప్పట్లో పోకిరి సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ అయి, సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి తెలుగు సినిమా మార్కెట్ ను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమాలో.. హీరో మహేష్ క్రిమినల్స్ పక్కనే ఉంటూ వారిని చంపుతూ చివర్లో పోలీస్ ఆఫీసర్ గా ఇచ్చిన ట్విస్ట్ సినిమాకు మేజర్ హైలైట్ అనే అనాలి.
మొత్తంగా పోకిరి బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయడంతో ఆ తర్వాత పోకిరి తరహాలో అదే జానర్లో మనకు చాలా సినిమాలు వచ్చాయనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇకపోతే ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే, పూరీ ఇప్పుడు బాలయ్యతో పైసా వసూల్ సినిమా చేయడమే ఆశ్చర్యం కలిగిస్తుందనుకుంటే.. దాన్నిప్పుడు కొంతమంది పోకిరితో పోలుస్తుండటం షాక్ ఇస్తోంది. ఈ సినిమాలో బాలయ్యను పూరీ కొత్తగా చూపించాడనే మాట కొంచెం గట్టిగానే వినిపిస్తుంది.
ముఖ్యంగా బాలయ్య స్టైల్ దగ్గరి నుంచి యాటిట్యూడ్ వరకు అన్నీ మనకు కొత్తగా కనిపించబోతున్నాయని అంటున్నారు. ఇక్కడితో ఆపేస్తే బాగానే ఉంటుంది.. కానీ రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో బాలయ్య వరసగా మర్డర్స్ చేసుకుంటూ పోతుండటం.. ఈ ఆపరేషన్ కు వీడే సరైనోడు అనే డైలాగ్ వినిపిస్తుండటం.. నువ్వు స్మగ్లర్ వా అంటే కాదు ఫ్రీడమ్ ఫైటర్ ను అంటూ బాలయ్య చెప్పడం బట్టి చూస్తే.. బాలయ్య అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ.. క్రిమినల్స్ ను ఏరిపారేసే క్యారెక్టర్ చేశాడేమో అనిపిస్తోందని కొంతమంది జోస్యం చెప్పేస్తున్నారు. మొత్తంగా పైసా వసూల్ ను పోకిరితోనూ, బాలయ్యను మహేష్ తోనూ పోల్చేస్తూ.. పూరీ బాలయ్యతో మరో పోకిరి తీశాడని ప్రచారం చేస్తున్నారు. మరి అదే నిజమైతే.. మరో పోకిరిని తెరపై చూడొచ్చేమో.