ఏదైనా నాన్న‌గారే నేర్పారు- బాల‌కృష్ణ‌

విశాఖ ఎంజీఎం గ్రౌండ్స్ వేదిక‌గా రూల‌ర్ ప్రీరిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో బాల‌య్య త‌న‌దైన శైలిలో అభిమానుల్లో క‌ల్లోలం పుట్టించారు.

బాల‌య్య మాట్లాడుతూ..“మా నాన్న ఎన్టీఆర్ నుండి కూడా మేం ఎలాంటి ప్రయోగం చేసిన మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో అయినా, సినిమాల్లో అయినా ప్రయోగాలను తొలి అడుగు మనమే ముందు వేయాలని నాన్నగారి నేర్చుకున్నాం. మేం ప్రయోగాలు చేస్తున్నాం అంటే ప్రేక్షకుల ఆదరణ వల్లే.  సి.కళ్యాణ్, కెఎస్ రవికుమార్ తో కలిసి గ‌తంలో జయసింహ చిత్రం చేశాం. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదే స్పూర్తితో మళ్లీ ఈ రూలర్ చిత్రం చేశాం. మేం చేసిన ప్రయత్నానికి మంచి ఫలితం దక్కింది అంటే అది అభిమానులవల్లే. చక్కని మంచి చిత్రాలు వచ్చినప్పుడు తెలుగు వాళ్లు తప్పకుండా ఆదరిస్తారని రుజువు చేశారు.ర‌క‌ర‌కాల క‌థ‌లు అనుకుని చివ‌రిగా ఈ కథను చేయాలని అనుకున్నాం. దేశానికి అన్నంపెట్టే రైతు మీద సినిమా తీయాలనే కోరిక నాకు ఎప్పటి నుండో ఉంది. అది ‘రూలర్’ సినిమాతో తీరింది. ఈ సినిమాలో నా పాత్రలు రెండా మూడా అనేది చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. మీరే తెర‌పై చూడబోతున్నారు నా పాత్రలు ఎలా ఉంటాయో. . దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాన్ని ఈ సినిమాలో చూపించాం. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది“ అన్నారు.