వినాయ‌క్‌కే ఎందుకిలా?

Last Updated on by

నంద‌మూరి బాల‌కృష్ణ – వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్ సినిమా ఇంత‌కీ ఏమైన‌ట్టు? సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ అధినేత సి.క‌ళ్యాణ్ ఇప్ప‌టికే ప‌లుమార్లు బాల‌య్య‌తో భారీ బ‌డ్జెట్‌ చిత్రం ప్రారంభిస్తున్నామని ప్ర‌క‌టించారు. `చెన్న‌కేశ‌వ‌రెడ్డి` త‌ర‌వాత మ‌రో క్రేజీ సినిమాని తెర‌కెక్కించేందుకు వినాయ‌క్ క‌థ రెడీ చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. అయితే ఏమైందో ఈ ప్రాజెక్ట్ గురించి తాజా వివ‌రం తెలియ‌రాలేదు.

బాల‌య్య కాంపౌండ్‌లో ఓ క్లోజ్ సోర్స్ ప్ర‌కారం.. ఈ ప్రాజెక్ట్ ప్ర‌స్తుతానికి వాయిదా ప‌డిన‌ట్టేన‌ని తెలిసింది. క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ `మ‌ఫ్టీ` రీమేక్ క‌థ‌ను వినాయ‌క్ ఇటీవ‌లే బాల‌య్య‌కు వినిపించారు. కానీ ఆ క‌థ అస్స‌లు న‌చ్చ‌లేదుట‌. దాంతో ఓ స్ట్రెయిట్ క‌థ‌ను రెడీ చేసి తేవాల్సిందిగా విన‌య్‌ని బాల‌య్య కోరారుట‌. దీంతో వినాయ‌క్ త‌దుప‌రి సినిమా మ‌రింత ఆల‌స్యం కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక బాల‌య్య‌బాబు ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో బిజీగా ఉన్నారు కాబ‌ట్టి .. సంక్రాంతి త‌ర‌వాతే వినాయ‌క్‌తో సినిమా ఉండే అవ‌కాశం ఉందిట‌. 2019 సంక్రాంతి కానుక‌గా `ఎన్టీఆర్‌` రిలీజ‌వుతుంది కాబ‌ట్టి త‌దుప‌రి వినాయ‌క్‌తో సిట్టింగ్స్ ఉంటాయ‌ని చెబుతున్నారు. బాల‌కృష్ణ హీరోగా ప‌ర‌మ వీర చ‌క్ర‌, జై సింహా చిత్రాల్ని సి.క‌ళ్యాణ్ నిర్మించారు. ప్ర‌స్తుతం బాల‌య్య‌- వినాయ‌క్ కాంబినేష‌న్‌తో సినిమా చేయాల‌ని ఉవ్విళ్లూరినా సాంకేతిక కార‌ణాల‌తో అలా వాయిదా ప‌డుతోంది. `ఇంటెలిజెంట్` లాంటి ఫ్లాప్ తీసిన వినాయ‌క్‌కి వెంట‌నే అవ‌కాశం వ‌చ్చినా, అదృష్టం వెన్ను త‌ట్ట‌లేదు.

User Comments