బ్లేడ్ బాబ్జీ పాత్ర‌లో బండ్ల గ‌ణేష్

bandla as Blade Babji

న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు త‌న‌దైన శైలి వ్యాఖ్య‌ల‌తో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అందులో బ్లేడ్ తో కంఠం కోసుకుంటాన‌ని ఒక‌టి. కాంగ్రెస్ అధికారంలోకి రాక‌పోతే ప‌బ్లిక్ గా ఆ ప‌నిచేస్తాన‌ని స‌వాల్ విసిరాడు. కానీ త‌ర్వాత ఛాలెంజ్ ని వెన‌క్కి తీసుకున్నాడనుకోండి. ఇప్పుడ‌దే పాయింట్ ను అనీల్ రావిపూడి `స‌రిలేరు నీకెవ్వ‌రు` లో వాడుతున్నాడుట‌. ఇందులో బండ్ల గ‌ణేస్ ఓ కామెడీ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

తాజాగా అందుతో న్న స‌మాచారం ప్ర‌కారం గ‌ణేష్ బ్లేడ్ గ‌ణేష్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని వినిపిస్తోంది. అనీల్ రావిపూడి 7ఓ క్లాక్ బ్లేడ్ కామెడీ ట్రాక్ ఒక‌టి రాసాడ‌ని స‌మాచారం. కామెడీ స‌న్నివేశాలు రాయ‌డం అనీల్ కు కొట్టిన పిండి. ఇలాంటి వాస్తవ సంఘ‌ట‌న‌లు ఆధారంగా అల్లు కున్నాడంటే అవి మ‌రింత హాస్యాన్ని పంచుతున్నాయి. అస‌లే బ్లేడ్ తో బండ్ల అసాధార‌ణ పాపులార‌నిటీ సంపాదించాడు. న‌టుడిగా క‌న్నా ఎక్కువ గుర్తింపు నిచ్చిందే ఆ బ్లేడ్ స‌వాలే క‌దా.