బండ్ల ప‌వ‌న్‌కి హ్యాండు!

Last Updated on by

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి, మెగా ఫ్యామిలీకి బండ్ల గ‌ణేష్ అత్యంత స‌న్నిహితుడు. ఆ క్ర‌మంలోనే అత‌డు నిర్మాత‌గా మారి గ‌బ్బ‌ర్‌సింగ్‌, గోవిందుడు అంద‌రివాడేలే వంటి చిత్రాల్ని నిర్మించాడు. ప‌వ‌న్ ఒక మాష్ట‌ర్ పీస్‌.. అత‌డు త‌న‌కు దేవుడుతో స‌మానం అని అంటాడు బండ్ల‌. నిజంగా ప‌వ‌న్‌కి అంత‌టి భ‌క్తుడు వేరొక‌రు ఉంటారా? అని పొగ‌డ్త‌లు అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ దేవుడికే ఎస‌రు పెడుతున్నాడు బండ్ల‌. త‌న దేవుడు అయిన జ‌న‌సేనానిని ప‌ట్టించుకోకుండా వేరొక పార్టీలో చేరుతుండం చ‌ర్చ‌కొచ్చింది.

యువ‌రాజా రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మ‌క్షంలో నేడు కాంగ్రెస్‌లో చేరుతున్నాడు బండ్ల‌. అందుకోసం దిల్లీకి వెళ్లాడు. నేడే పార్టీ కండువా క‌ప్పుకునే అరుదైన దినం. మొత్తానికి బ్లాక్‌బ‌స్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ బండ్ల గ‌ణేష్ ఇలా చేస్తాడ‌ని ఏ మెగాభిమాని ఊహించి ఉండ‌డు. మొత్తానికి భ‌క్తుడు దేవుడికి హ్యాండిచ్చాడు. అయితే భ‌క్తుడు హ్యాండివ్వ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే.. అస‌లు తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ పోటీ చేస్తేనే క‌దా! త‌న కార‌ణాలు త‌న‌కున్నాయి.

User Comments