బందోబ‌స్త్ మూవీ రివ్యూ

సినిమా: బందోబ‌స్త్

నటీనటులు: సూర్య‌, మోహ‌న్ లాల్, ఆర్య‌, స‌యేషా, బొమ‌న్ ఇరానీ, సముదిర‌క‌ని త‌దిత‌రులు..

రచన- దర్శకత్వం: కేవీ ఆనంద్

బ్యానర్: లైకా ప్రొడక్షన్స్

సంగీతం: హారిస్ జైరాజ్

ముందు మాట:

కొన్ని వ‌రుస పరాజ‌యాల‌తో స్టార్ హీరో సూర్య రేసులో వెన‌కబ‌డిన సంగ‌తి తెలిసిందే. అత‌డి తాజా ప్ర‌య‌త్నం `బందోబ‌స్త్`. ఎన్.ఎస్.జీ క‌మెండోగా రైతుగా సూర్య వేరియేష‌న్స్ ఉన్న పాత్ర‌లో న‌టించారు. మ‌ల‌యాళ‌ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్ర‌ధాని పాత్ర‌లో న‌టించారు. కేవీ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దాదాపు 75 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ్- తెలుగు భాషల్లో నేడు (20సెప్టెంబ‌ర్) విడుదలైంది. ఇప్ప‌టికే టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే ప్రీవిజువ‌ల్స్ ని బ‌ట్టి ఇది దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సినిమా అని అర్థ‌మైంది. కేవీ ఆనంద్ మ‌రోసారి రంగం త‌ర‌హాలో త‌న‌దైన మాస్ట‌ర్ పీస్ ఇచ్చాడా లేదా? సూర్యకు ఇది కంబ్యాక్ మూవీ అవుతుందా లేదా? అన్న‌ది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సింగిల్ లైన్:

దేశ‌భ‌క్తుడైన ఎన్.ఎస్.జీ క‌మెండో సూర్య.. అంబానీ రేంజు బిజినెస్‌మేన్ కం విల‌న్ బొమ‌న్ ఇరానీ నుంచి దేశ‌ ప్ర‌ధానిని కాపాడేందుకు ఏం చేశాడు? పీఎంతో ఆడే కార్పొరెట్ గేమ్ లో బొమ‌న్ తీవ్ర‌వాదుల్ని ఎలా వాడుకున్నాడు? డైన‌మిక్ పీఎం మోహ‌న్ లాల్ హ‌త్య‌కు గుర‌య్యాక.. అత‌డి వార‌సుడిగా యంగ్ పీఎం ఆర్య విల‌న్ ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క‌థ‌లోనే రైతుల బ్యాక్ డ్రాప్ ఏంటి? సూర్య‌ రైత‌న్న‌గా ఎందుకు క‌నిపిస్తారు? స‌యేషా ల‌వ్ స్టోరి ఏమిటి? అన్న‌దే సినిమా. ఆద్యంతం దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది.

కథనం అనాలిసిస్:
కేంద్ర మంత్రిని కొంద‌రు అమాయ‌కుల్ని చెర‌బ‌ట్టిన తీవ్ర‌వాదుల నుంచి కాపాడే ప్ర‌య‌త్నంలో మంత్రిని చంపేస్తారు. క‌మెండో ఆప‌రేష‌న్ లో మంత్రిని పోగొట్టుకున్నా మిగ‌తా వారిని ర‌క్షించ‌గ‌లుగుతారు. ఆ క్ర‌మంలోనే సేంద్రియ పంట‌లు పండించే రైతుగా సూర్య ప‌రిచ‌యం అవుతారు. అటుపై ఎన్.ఎస్.జీ అధికారుల‌ చేతికి చిక్కిన తీవ్ర‌వాది పీఎంపై హ‌త్యాయ‌త్నానికి సంబంధించిన స్కెచ్ ని వెల్ల‌డిస్తారు. అయితే ఇక్క‌డే విలేజ్ లో రైతుగా ఉన్న సూర్యను తీవ్ర‌వాదిగా అనుమానించే ప‌రిస్థితి వ‌స్తుంది. ఆ క్ర‌మంలోనే అత‌డు తీవ్ర‌వాది కాదు ఎన్.ఎస్.జీ అధికారి అని తెలుసుకోవ‌డం.. అత‌డిని పీఎం ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీగా నియ‌మితుడు కావ‌డం వ‌గైరా చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. ప్ర‌ధానిని లండ‌న్ లో ఓ ఎటాక్ నుంచి సూర్య‌ ర‌క్షిస్తాడు.

తాను ఎంత ప్ర‌య‌త్నించినా చివ‌రికి పీఎం మోహ‌న్ లాల్ ని ర‌క్షించ‌లేక‌పోతాడు. ప్ర‌ధాని హ‌త్య వెన‌క కుట్ర‌దారుడు అయిన అంబానీ రేంజ్ ధ‌న‌వంతుడు బొమ‌న్ ఇరానీతో రైతు కం సెక్యూరిటీ అధికారి సూర్య వార్ కొన‌సాగుతుంది. త‌న ఊరిలోని రైతుల భూములు లాక్కునేందుకు బొమ‌న్ చేసిన‌ కుట్ర‌ను యువ పీఎం ఆర్య సాయంతో సూర్య అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. అస‌లు కార్పొరెట్ దిగ్గ‌జం బొమ‌న్ ప్రాజెక్ట్ ఏమిటి? దానికోసం రైతుల నుంచి భూముల‌ను లాక్కోవాల్సిన అవ‌స‌రం ఏంటి? చివ‌రికి ఆర్య‌ సాయంతో ఎన్.ఎస్.జీ క‌మెండో సూర్య అనుకున్న‌ది సాధించాడా లేదా? విల‌న్ ని అంత‌మ‌య్యాడా లేదా? అన్న‌ది మిగ‌తా సినిమా.

కేవీ ఆనంద్ ఎంపిక చేసుకున్న క‌థ బావుంది.. దేశ‌భ‌క్తి ఇతివృత్తం ఆక‌ట్టుకునేదే. అయితే ఈ త‌ర‌హా సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా ఏ రేంజుకు చేర‌తాయి అన్న‌ది చెప్ప‌లేం. పంట‌ల్ని నాశ‌నం చేసే ఎరువుల్ని మార్కెట్లోకి దించ‌డం ద్వారా ఆ భూముల్లో పంట పండ‌కుండా ప‌న్నాగం ప‌న్న‌డం .. త‌న ప్రాజెక్టు కోసం భూముల్ని లాక్కునేందుకు ప్ర‌య‌త్నించడం అన్న పాయింట్ ప్ర‌స్తుత స‌న్నివేశానికి కనెక్టివ్ గా ఉంది. ఆ ఊరి రైతుగా .. ఎన్.ఎస్.జీ క‌మెండోగా రైతుల‌కు అండ‌గా నిలిచే సూర్య‌ను బాగానే ఎలివేట్ చేశాడు. కానీ రొటీన్ గా ముందే తెలిసిపోయే క‌థ‌నం మాత్రం చికాకు పుట్టిస్తుంది. సినిమా ఆద్యంతం సూర్య మైమ‌రిపించే న‌ట‌న ఆక‌ట్టుకుంటున్నా ఇంకా ఏదో లోటు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. ఫ‌స్టాఫ్ ముగిసేప్ప‌టికి బావుంది అని చెప్ప‌లేం.. బాలేద‌ని అన‌లేం. సెకండాఫ్ లో యువ పీఎం ఆర్య వ‌చ్చాక క‌థ‌నంలో గ్రిప్ పెరిగిందా అంటే రొటీన్ గానే సాగుతుంది. ముందే తెలిసిపోయిన విల‌న్లు బొమ‌న్ ఇరానీ, చిరాగ్ ల‌ను చివ‌రికి అంత‌మొందించేస్తారు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఆక‌ట్టుకున్నా.. సెకండాప్ టేకాఫ్ అయిన విధానం బావున్నా.. ప్రీక్లైమాక్స్.. క్లైమాక్స్ ప‌ర‌మ రొటీన్ గా ఫ్లాట్ గా ముగియ‌డం నిరాశ‌ప‌రుస్తుంది.

నటీనటులు:
ఎప్ప‌టిలానే సూర్య త‌న భుజ‌స్కంధాల‌పై సినిమాని మోసాడు. ఎన్.ఎస్.జీ క‌మెండో పాత్ర‌లో ఒదిగిపోయి న‌టించాడు. రైతుగానూ ఓకే. సినిమాకి అత‌డి న‌ట‌నే హైలైట్. ప్ర‌ధాని పాత్ర‌లో మోహ‌న్ లాల్ ఒదిగిపోయి న‌టించారు. ఆర్య‌- స‌యేషా జంట డీసెంట్ పెర్ఫామెన్స్ ఆక‌ట్టుకుంటుంది. బొమ‌న్ విల‌నీ ప్ల‌స్. ఇత‌ర పాత్ర‌లు ఓకే.

టెక్నికాలిటీస్:
హ్యారిస్ జైరాజ్ సంగీతం రొటీన్ గా ఉన్నా రీరికార్డింగ్ సినిమాకి ప్ల‌స్. సినిమాటోగ్ర‌ఫీ ఓకే. అయితే కేవీ ఆనంద్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ నుంచి ఆశించినంత కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం నిరాశ‌ప‌రుస్తుంది. లైకా సంస్థ నిర్మాణ విలువ‌లు రిచ్ గా ఆక‌ట్టుకున్నాయి.

ప్లస్ పాయింట్స్:
* క‌థాంశం
* సూర్య న‌ట‌న‌, మోహ‌న్ లాల్, బొమ‌న్ ల‌ న‌ట‌న‌
* వ్య‌వ‌సాయం, రైతన్న‌ స‌మ‌స్య అన్న టాపిక్

మైనస్ పాయింట్స్:
* రొటీన్ .. ఫ్లాట్ నేరేష‌న్
* క్లైమాక్స్ నిరాశ‌ప‌ర‌చ‌డం
*క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేక‌పోవ‌డం

ముగింపు:
సూర్య ప్ర‌య‌త్నం మ‌రోసారి ఫెయిల్.. బిలో యావ‌రేజ్ `బందోబ‌స్త్`.

రేటింగ్:
2.25/5