డైల‌మాలో బంగార్రాజు

Last Updated on by

ప్ర‌యోగాల‌కు ఏమాత్రం వెర‌వ‌ని హీరో కింగ్ నాగార్జున‌. మ‌నం, ఊపిరి వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టించారు. సేమ్ టైమ్ `సోగ్గాడే చిన్ని నాయ‌నా` లాంటి రియాలిటీని ప్ర‌తిబింబించే సినిమాలోనూ న‌టించి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నారు. ఈ త‌ర‌హా వైవిధ్యం పాటిస్తాడు కాబ‌ట్టే ఆయ‌న‌ మూడు ద‌శాబ్ధాల కెరీర్ బండిని సునాయాసంగా న‌డిపించేశాడు. నాగార్జున అంటే ఒక బ్రాండ్‌. అయితే దానిని నిల‌బెట్టాలంటే క‌చ్ఛితంగా కథ‌ల ఎంపిక‌లో విల‌క్ష‌ణ‌త‌, ద‌ర్శ‌కుడిలో ద‌మ్ము త‌ప్ప‌నిస‌రి. ఈ విష‌యంపై పూర్తి క్లారిటీ ఉన్నా స్నేహితుడైన రామ్‌గోపాల్ వ‌ర్మ కోసం ఓ సినిమాని త్యాగం చేశాడు. అది హిట్టో, ఫ‌ట్టో త‌ర్వాతి సంగ‌తి అనుకునే ఆఫీస‌ర్ సినిమా చేశాడు. అయితే అలాంటి సినిమా చేసిన ప్ర‌తిసారీ క్రిటిసిజం ఎదుర్కోవాల్సొస్తోంది. నాగార్జున ఇలాంటి ప‌ని చేయ‌కూడ‌దంటూ సుద్ధులు చెప్పేవాళ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు.

ఆ క్ర‌మంలోనే నాగార్జున అవేవీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం నానితో క‌లిసి శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర‌వాత నాగార్జున న‌టించే సినిమా ఏది? అంటే ఇన్నాళ్లు `సోగ్గాడే చిన్నినాయ‌నా` ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌తో ఖాయ‌మైన‌ట్టేన‌ని అభిమానులు భావించారు. కానీ ఇంత‌వ‌ర‌కూ ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఏదీ లేదు. క‌ళ్యాణ్ ని నాగార్జున హోల్డ్‌లో ఉంచార‌ని తాజాగా ప్ర‌చారం సాగుతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించిన `నేల టిక్కెట్` ఫ్లాప్ వ‌ల్ల‌.. ఇప్పుడు అత‌డితో ప్ర‌స్తుతం సినిమా చేయ‌డం రిస్క్ అని భావిస్తున్నార‌ట‌. ఇక నేల టిక్కెట్ ఫ్లాప్‌కి స‌వాల‌క్ష కార‌ణాలున్నాయ‌ని, నిర్మాత రామ్ తాళ్లూరి త‌ప్పిదాలు త‌న‌కు ఇబ్బంది క‌లిగించాయ‌ని క‌ళ్యాణ్ కృష్ణ ఇదివ‌ర‌కూ మీడియాలో వెల్ల‌డించాడు. అయితే వీట‌న్నిటి ప్ర‌భావం నాగార్జున‌తో సినిమాపై ప‌డుతోందిట‌. ఇప్ప‌టికైతే నాగార్జున – నాని మ‌ల్టీస్టార‌ర్ ఫుల్ స్వింగులో ఉంది. బంగార్రాజు భ‌విష్య‌త్‌పై నాగార్జున‌నే క్లారిటీనివ్వాల్సి ఉంది.

User Comments