బంగార్రాజుకి ఇంకా మెరుగులే?

Nagarjuna Clarified on Meeting with Jagan

Last Updated on by

క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో కింగ్ నాగార్జున `సొగ్గాడే చిన్ని నాయ‌నా` సినిమాకు సీక్వెల్ గా `బంగార్రాజు` తెర‌కెక్కిస్తున్నామ‌ని ప్ర‌క‌టించి చాలా కాల‌మ‌వుతోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కింది లేదు. `సొగ్గాడు చిన్ని నాయ‌నా` త‌ప్ప క‌ళ్యాణ్ తెర‌కెక్కించిన త‌క్కిన‌ సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతోనే కింగ్ ఆసినిమాను హోల్డ్ లో పెట్టిన‌ట్లు భావించారు. కానీ ఇటీవ‌లే మ‌రోసారి ఆ ప్రాజెక్ట్ పై వివ‌ర‌ణ ఇవ్వ‌డంతోనే రేపో మాపో సెట్స్ కెళ్ల‌డం ఖాయ‌మ‌నుకున్నారు. `మన్మ‌ధుడు-2` తో పాటే ఏక‌ధ‌థాటిగా ఆ సినిమాకు ప్రారంభించే అవ‌కాశాలున్నాయని అన్న‌పూర్ణ కాంపౌండ్ వ‌ర్గాల నుంచి వినిపించింది. కానీ తాజా స‌మాచారం ప్రకారం బంగార్రాజు సెట్స్ కెళ్ల‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ మ‌ద్య ఓ ఇంట‌ర్వూలో స్ర్కిప్ట్ లాక్ అయిందని నాగార్జున చెప్పినా! అస‌లు విష‌యం దాచిపెట్టిన‌ట్లు క‌ళ్యాణ్ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. క‌థ విష‌యంలో నాగ్ ఇంకా తర్జ‌భ‌ర్జ‌న ప‌డుతున్నారుట‌. మార్పులు చేర్పులు చేయమ‌ని వీలైనంత వ‌ర‌కూ స్టోరీకి, అందులో పాత్ర‌ల‌కు ఫ్రెష్ లుక్ తీసుకురావాల‌ని డైరెక్ట‌ర్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారుట‌. దీంతో క‌ళ్యాణ్ ఇబ్బంది ప‌డిన‌ప్ప‌టికి ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చింది నాగార్జునే కాబ‌ట్టి ఓపిక‌గా ఆ స్టోరీపైనే ఇంకా వ‌ర్క్ చేస్తున్నాడుట‌. ఈ ప్రోస‌స్ లో కొన్ని అవ‌కాశాలు వ‌చ్చినా వ‌దులుకున్నాడ‌ని స‌మాచారం. బంగార్రాజు బౌండెడ్ స్ర్కిప్ట్ తో రెడీఅవ్వ‌డానికి ఎలా లేద‌న్నా ఇంకా నాలుగు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు.


Related Posts