బంగార్రాజు కి ముహూర్తం పెట్టేసారా

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో బంగార్రాజు తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సొగ్గాడే చిన్ని నాయ‌నాకి సీక్వెల్ ఇది. స్ర్కిప్ట్ స‌హ అన్ని ప‌నులు పూర్తిచేసి క‌ళ్యాణ్ సిద్దంగా ఉన్నాడు. కింగ్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో సినిమాకు సంబంధించిన ఓ హాట్ అప్ డేట్ అందింది. న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కు వెళ్ల‌బోతున్నారుట‌. అలాగే చిత్రీక‌ర‌ణ కూడా వేగంగా పూర్తిచేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అన్ని ప‌నులు పూర్తిచేసి వేస‌వి కానుక‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. ఇటీవ‌లే కింగ్ న‌టించిన మ‌న్మ‌ధుడు-2 భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై చ‌తికిల ప‌డిన సంగ‌తి తెలిసిందే. అలాగే క‌ళ్యాణ్ కూడా ప్లాప్ ల్లో ఉన్నాడు. ఆయ‌న గ‌త సినిమా నేల టిక్కెట్ ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో కింగ్ సీక్వెల్ ను వాయిదా వేసుకుంటూ వ‌చ్చార‌ని ఓ రూమర్ వినిపించిన విష‌యం తెలిసిందే.