బ్యాంకుల కొలువుల మేళా

Last Updated on by

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్’ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 1,389 పోస్టులున్నాయి. తెలంగాణలో 612, ఆంధ్రప్రదేశ్‌లో 777 పోస్టులు ఉన్నాయి. APUS ఐబీపీఎస్. అలాహాబాద్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రల్లో ఈ పోస్టుల భర్తీ జరగనుంది.

ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 9 సాయంత్రం 5 గంటలు.విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్ / డిప్లొమా / డిగ్రీ ఉండాలి.
వయస్సు: 20 నుంచి 28 ఏళ్లు.ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమినరీ ఆబ్జెక్టీవ్ టైప్ టెస్ట్, కంప్యూటర్ బేస్ట్ మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


Related Posts