ఒబామా కంపెనీ భారీ చిత్రాలు

Last Updated on by

రాజ‌కీయ నాయ‌కులు సినిమా నిర్మాత‌లుగా కొన‌సాగ‌డం అన్న‌ది ఇప్పుడే కొత్తేం కాదు. ఆ కోవ‌లో చూస్తే ఇండియాలో రాజ‌కీయ నాయ‌కుల్లో మెజారిటీ పార్ట్ సినిమా రంగం వైపు ఆక‌ర్షితులై ఈ రంగంలో ర‌క‌ర‌కాల మార్గాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. బినామీల పేర్ల‌తో సినిమాలు తీస్తున్నారు. ప‌న్ను మిన‌హాయింపుల కోసం వినోద‌రంగంపై ఆధార‌ప‌డి, ఇక్క‌డ బ్లాక్ మ‌నీని వైట్ చేస్కున్న మ‌హానుభావుల చ‌రిత్ర‌ను త‌వ్వితే త‌ర‌గ‌ని గ‌నిలా బ‌య‌ట‌ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. భార‌త‌దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో లెక్క‌కు మిక్కిలి నిర్మాత‌లు రాజ‌కీయ నాయ‌కులు, పారిశ్రామిక వేత్త‌లు ఉన్నారు. ఇక విదేశాల వైపు వెళితే అమెరికాలోనూ ఈ స‌న్నివేశం కొన‌సాగుతోంది.

అమెరికా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ యాక్ట‌ర్ కం నిర్మాత‌. ప‌లు టీవీ సిరీస్‌లు నిర్మించారు. ఇక‌పోతే అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ప్ర‌స్తుతం సినీనిర్మాణ రంగంలోకి ప్ర‌వేశిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే భార్య మిచెల్లీతో క‌లిసి ప్ర‌ఖ్యాత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకోవ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌తో క‌లిసి ఒబామా కంపెనీ వ‌రుస‌గా ప‌లు భారీ చిత్రాల్ని నిర్మించ‌నుంది. డాక్యు సినిమాలు, సిరీస్‌లు, అలానే డాక్యుమెంట‌రీలు, స్క్రిప్టెడ్ షోలు నిర్మించేందుకు భారీ ఒప్పందం చేసుకుంది ఒబామా కంపెనీ.

User Comments