స్టైలిష్ స్టార్ గ్యారేజ్‌లో బీస్ట్

అల్లు అర్జున్ గ్యారేజ్ లో ఇప్ప‌టికే ఖ‌రీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. సంద‌ర్భాన్ని బ‌ట్టి అత‌డు కార్ ని ఉప‌యోగిస్తుంటారు. తాజాగా అత‌డి గ్యారేజ్ లో మ‌రో స‌రికొత్త కార్ వ‌చ్చి చేరింది. భారీ ఆకారం ఉన్న రేంజ్ రోవ‌ర్ ఇది. ఈ కార్ పేరు బీస్ట్ అంటూ బ‌న్ని స్వ‌యంగా ప‌రిచ‌యం చేశారు.

నా ఇంటి గ్యారేజ్ లోకి కొత్త కార్ వ‌చ్చి చేరింది. దీనికి BEAST అనే పేరు పెట్టుకున్నా. సంథింగ్ కొత్త‌గా ఉండే వాహ‌నం కొన్నాను. దీనిపై నా కృత‌జ్ఞ‌తాభావం ఎప్పుడూ ఉంటుంది. #rangerover #aabeast అంటూ ఇన్ స్టాలో పోస్టింగ్ పెట్టారు.