నిర్మాత‌ల‌కు తాప్సీ పంగ‌నామం

Last Updated on by

అరెరే తాప్సీ .. ఫైట‌ర్ తాప్సీ.. బోల్డ్ అండ్ బ్యాటిల్ తాప్సీ.. ఎంత ప‌ని చేసింది? ఎంత‌కు తెగించింది? అస‌లు ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా ఈ అమ్మ‌డి య‌వ్వారం? ఎవ‌రైనా అంచ‌నా వేయ‌గ‌ల‌రా తాప్సీ పారితోషికం ఎంతో? అస‌లు ఈ దిల్లీ భామ బాలీవుడ్ వెళ్లింది మొద‌లు అటునుంచి ఇటు వ‌చ్చేందుకే వెన‌క‌డుగేస్తోంది. అంతేనా .. ఎవ‌రైనా సౌత్ నిర్మాత సినిమాకి క‌మిట‌వ్వాలంటే, పేచెక్ ఎంత ఇవ్వాలి? అని ప్ర‌శ్నించ‌డ‌మే ఆల‌స్యం క‌ళ్లు భైర్లు క‌మ్మే పారితోషికం చెబుతోందిట ఈ భామ‌. మునుప‌టితో పోలిస్తే అది డ‌బుల్ చెబుతోందిట‌.

అయితే టాలీవుడ్ పైనా, కె.రాఘ‌వేంద్ర‌రావు పైనా నిప్పులు చెరిగిన తాప్సీ కెరీర్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఏం ఉంద‌ని? అయినా అంత పెద్ద మొత్తం డిమాండ్ చేస్తోంద‌ని నిర్మాత‌ల్లో ఒక‌టే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పింక్‌, నామ్ ష‌బానా సినిమాలు తాప్సీలో ఆత్మ‌విశ్వాసం నింపాయి. జుడ్వా 2 కూడా కిక్కిచ్చింది. ఆ క్ర‌మంలోనే తాప్సీతో కార్పొరెట్ కంపెనీలు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లకు ఒప్పందాలు చేసుకున్నాయి. అవ‌న్నీ బుల్లితెర‌పై అల‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం తాప్సీ `మ‌న్మార్జియాన్‌` అనే చిత్రంలో న‌టిస్తోంది. విక్కీ కౌశ‌ల్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ఇందులో కీల‌క‌పాత్ర‌ధారులు. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్‌కి స్పంద‌న బావుంది. విక్కీ-తాప్సీ జంట తెర‌పై ఎలాంటి విజువ‌ల్ ట్రీట్ ఇస్తారోన‌న్న టాక్ న‌డుస్తోంది. అయితే తాప్సీ ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత అయినా సౌత్‌లో సినిమా చేస్తుందేమో చూడాలి.

User Comments