రూ.3 ల‌క్ష‌ల‌కే నైట్ పార్టీకి బ్యూటీ రెడీ

Last updated on November 13th, 2019 at 09:12 am

సినిమాలు .. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంతో పాటు ఐటెమ్ నంబ‌ర్ల రెవెన్యూ మ‌న క‌థానాయిక‌లకు బోలెడంత ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే ఆశ‌ అంత‌టితో ఆగిపోతుందా? అంటే .. అలాంటిదేమీ లేదు. సంపాదించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క మార్గాన్ని వ‌దిలిపెట్ట‌డం లేదు. యువ‌త‌రానికి.. పార్టీ క్రౌడ్‌కి ఎంత‌గా కిక్కు ర‌ప్పిస్తే అంత‌గా త‌మ‌కు ఆదాయం రెట్టింప‌య్యే మార్గాల్ని ప‌లువురు భామ‌లు వెతుకుతున్నారు. అలాంటివి స‌వాల‌క్ష మార్గాలు.

ముఖ్యంగా మ‌న హీరోయిన్లు అనుస‌రించే ఓ మార్గం మాత్రం ఎన్నో విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. సినిమాల‌తో సంపాద‌న ఎంత ఉన్నా సైడు మార్గాల్లో ఆర్జ‌న చేయాల‌న్న ఆలోచ‌న‌తో ప‌లువురు బ్యూటీస్ ఇంత‌కుముందు ర‌క‌ర‌కాల స్కాములు, స్కీముల్లో ఇరుక్కున్నారు. 2018లో అమెరికా సెక్స్ స్కాండ‌ల్ లీకేజీతో ఆ విష‌యం కాస్తా బ‌య‌ట‌ప‌డిపోయింది. విదేశాల్లో ఈవెంట్ల మాటున జరిగే భోగోతంపై ప‌లు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు రావ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే అక్క‌డ ఈవెంట్ మేనేజ‌ర్ల వేధింపుల‌కు లొంగిపోయి అన్నిటికి ఒప్పుకునే భామ‌లు కొంద‌రైతే.. అలా కాకుండా కేవ‌లం నైట్ పార్టీల్లో డ్యాన్స్ షోలు, స్కిట్ల‌కు అందే పారితోషికంతో స‌రిపుచ్చుకునే భామ‌లు కొంద‌రు ఉన్నారు. నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలివ్వ‌ని బాప‌తు కొంద‌రున్నారు. కాస్త నిజాయితీగా సంపాదించుకుని వెళ్లిపోవాల‌ని భావించేవాళ్లు ఉన్నార‌ట‌. ఓ స‌మాచారం ప్ర‌కారం.. ఓ అందాల హీరోయిన్ ఒక్కో నైట్ పార్టీకి రూ.3-5ల‌క్ష‌లు వ‌ర‌కూ డిమాండ్ చేస్తోంద‌ట‌. ఎలానూ డిసెంబ‌ర్ 31 నైట్ పార్టీకి టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఈ సంద‌ర్భంగా ఓ మేనేజ‌ర్ ద్వారా ఈ లీకేజీ అందింది.