బెబో దెబ్బ‌కు కియ‌రా ఔట్‌!

Last Updated on by

అంబానీ వెడ్డింగ్ హైలైట్స్ గురించి మాట్లాడాలంటే ఆ ఇద్ద‌రి గురించి మాట్లాడాల్సిందే. ఆకాష్ అంబానీ- శ్లోకా మెహ‌తా పెళ్లి ఆద్యంతం బాలీవుడ్ భామ‌లు త‌మ సోకుల్ని ఎలివేట్ చేసేందుకు చాలానే తంటాలు ప‌డ్డారు. గంట‌ల కొద్దీ మేక‌ప్ రూమ్ కే కేటాయించార‌ని ఆ గెట‌ప్పులు చూశాక అర్థ‌మైంది. కొంద‌రు భామ‌లు ఉల్లి పొర డ్రెస్సుల్లో వ‌న్నె చిన్నెల్ని ఎలివేట్ చేసేందుకు త‌పిస్తే మ‌రికొంద‌రు సాంప్ర‌దాయంలోనే కొత్తందాల్ని ఎలివేట్ చేసేందుకు త‌పించారు. వ‌జ్ర వైఢూర్య స‌మేతంగా డిజైన్ చేసిన దుస్తుల‌తో త‌ళ‌త‌ళ‌లాడిపోయారు.
ఆదివారం ఉద‌య‌మే ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ తో క‌లిసి దిశా పటానీ అదిరిపోయే గెట‌ప్ లో దిగిపోయింది. ఎన్న‌డూ లేనిది ఉల్లి పొర చీర‌లో దిశా ఇచ్చిన క‌టింగ్ ఎర్త్ షేకింగ్ కి కార‌ణ‌మైంది. ఇదే పెళ్లి వేడుక‌లో టాలీవుడ్ హాట్ గాళ్ కియ‌రా అద్వాణీ సోకుల గురించి ప్ర‌త్యేకంగా ముచ్చ‌ట సాగింది. కియ‌రా ఈ పెళ్లి వేడుక‌కే స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. అయితే న‌వ‌త‌రం భామ‌ల‌తో పోటీప‌డుతూ బెబో క‌రీనా క‌పూర్ ఇచ్చిన ఫోజు బోయ్స్ గుండెల్లో ఆటంబాంబ్ లా పేలింది. బెబో 16 వ‌య‌సు టీనేజీ గాళ్ నే త‌ల‌పించింది. బెబో చెంత ఉన్న కియరానే ఏజ్ ఎక్కువా? అన్న‌ట్టుగా క‌నిపించిందంటే అతిశ‌యోక్తి కాదు. ఓవ‌రాల్ గా ఈ షోలో కియ‌రా, దిశా ప‌టానీల కంటే ఎక్కువ మార్కులు బెబో క‌రీనా క‌పూర్ కొట్టేయ‌డం కొస‌మెరుపు. ముంబై జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్ లో జ‌రిగిన పెళ్లి వేడుక ఆద్యంతం బాలీవుడ్ సెల‌బ్రిటీలు త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.