`కార్తికేయ`తో పోలికే ఉండ‌దు!-బీరం సుధాక‌ర్‌

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ‘కార్తికేయ’ ట్రెండ్ సెట్టర్. ఆ చిత్రానికి పూర్తి భిన్న ంగా మా సినిమా ఉంటుదని అన్నారు బీరం సుధాకర రెడ్డి. ఆయన నిర్మించిన తాజా చిత్రం  ‘సుబ్రహ్మణ్యపురం’ నేడు థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుమంత్ జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వ ంలో ఇంపెక్స్ ఇండియా ప్ర.లి. పతాకంపై నిర్మించారు. నిర్మాత బీరం సుధాకర రెడ్డి చెప్పిన సంగతులివి.

కుల దైవం సెంటిమెంటు

మా ఇంటి కుల దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మా పూర్వీకులు కర్నూల్ జిల్లా నంద్యాల దగ్గర సుబ్రహ్మణ్యేశ్వరపుతూర్ అనే గ్రామంలో సుబ్రమణేశ్వరస్వామి ఆలయం కట్టించారు. అప్పట్లో వారే ఆ ఆలయ ధర్మకర్తలుగా ఉండేవారు. ఈ సినిమా కూడా సుబ్రమణేశ్వర స్వామి పేరుతో ఉండడం, ఈ చిత్ర దర్శకుడు సంతోష్ ఈ సినిమా స్టోరీని వేరే నిర్మాతకి చెప్పడం నాకు తెలిసింది. నేను కథ విన్నాను. ఈ కథ నాకు బాగా నచ్చడంతో ఈ సినిమాను నిర్మించాను. ఈ సినిమా ‘కార్తికేయ’కు పూర్తి బిన్నంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్ప ఈ సినిమాలో కామన్ పాయింట్ అనేది ఉండదు. కొత్త డైరెక్టర్ అయినా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడు.

కథ అద్భుతం

మానవ మేధస్సు గొప్పదా -దైవశక్తి గొప్పదా? అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా చూసిన తరువాత దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా దైవం ఉంది అని నమ్మే విధంగా ఈ సినిమాను దర్శకుడు సంతోష్ తెరకెక్కించారు. భక్తితో కూడిన థ్రిల్లర్‌ని సైంటిఫిక్ విధానంలో తీశాం. పూర్వం రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి దైవం తీరును, గొప్పతనాన్ని ఈ సినిమాలో చూపించాం. వాటితో పాటు ఆడియన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. పోలింగ్ తరువాత వరుసగా మూడు సెలవుదినాలుంటాయనే ఇప్పుడు  రిలీజ్ చేస్తున్నాం. అందరికీ నచ్చే చిత్రమిది.

ఈ కథకు సుమంత్ పెర్‌ఫెక్ట్ యాప్ట్. దర్శకుడే ఆ మాట చెప్పారు. తరువాత నాకు కూడా సుమంత్ అయితే బాగుంటుందనిపించి సంప్రదించాం.  కథకు తగ్గట్టే బాహుబలి లాంటి గొప్ప చిత్రాలకు పనిచేసిన అన్నపూర్ణ వాళ్లు గ్రాఫిక్స్ అందించారు. కథానుగుణంగా గ్రాఫిక్స్‌కి మంచి ప్రాధాన్యం ఉంటుంది. సంతోష్ ఈ సినిమా కథ చెప్పిన దానికంటే బాగా తీశాడు. లఘుచిత్రాలు చేసిన అనుభవం తనకు ఉంది. సుమంత్ గారు 90 శాతం అని అన్నా.. నా వరకు సంతోష్ ఈ సినిమాను 100 శాతం బాగా తీశాడనిపించింది.

User Comments