అర్జున్ రెడ్డి కూడా బాహుబలి బాట లోనే

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ఈ నెల 25 న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. యూత్ సైడ్ నుంచి ఓ రేంజ్ లో సందడి కనిపిస్తోన్న విషయం తెలిసిందే. అందుకే తాజాగా ఈ క్రేజీ సినిమా ప్రీమియర్ షో టికెట్స్ పెడితే అప్పుడే హాట్ కేకుల్లా అయిపోయాయని సమాచారం. ఇక ఇప్పుడేమో ఈ సినిమా స్పెషల్ పెయిడ్ ప్రివ్యూల పేరిట ఏకంగా బాహుబలి బాటలోనే పయనిస్తుందని తెలియడం ఇంట్రెస్టింగ్ న్యూస్ అవుతుంది. అసలు స్టోరీలోకి వెళితే, బాహుబలి ది కంక్లూజన్ సినిమాను నైజాం ఏరియాలో పంపిణీ చేసిన ఏషియన్ సినిమాస్ వాళ్లే ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాను కూడా పంపిణీ చేయడానికి ముందుకు రావడంతో ఇప్పుడు స్పెషల్ పెయిడ్ ప్రివ్యూల బాట పట్టారని అంటున్నారు.

ముందుగా ఏషియన్ సినిమాస్ వాళ్ళు అర్జున్ రెడ్డి ని హోల్ సేల్ గా 5.5 కోట్ల రూపాయలు పెట్టి కొనేశారని న్యూస్ వచ్చిన నేపథ్యంలో.. ఆ కారణంగానే బాహుబలి-2 మాదిరిగా రిలీజ్ ముందు రోజు రాత్రి స్పెషల్ పెయిడ్ ప్రివ్యూలు వేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాహుబలి-2 రిలీజ్ టైమ్ లో ఏషియన్ గ్రూప్ వాళ్ళు తమ ఆధ్వర్యంలో నడిచే థియేటర్స్ లో ప్రివ్యూలు వేసుకుంటే.. అప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళను ఫాలో అయిపోయారని, ఇప్పుడు అదే ఫార్ములాను అర్జున్ రెడ్డి విషయంలో అప్లై చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులోనూ అర్జున్ రెడ్డి పై ఓ వర్గంలో ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండటంతో.. ఈ ముందు రోజు రాత్రి స్పెషల్ పెయిడ్ ప్రివ్యూలు కలిసొస్తాయని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీటికి ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయని అంటుండటం విశేషం. ఇకపోతే, టీజర్ ట్రైలర్ తో దుమ్మురేపిన అర్జున్ రెడ్డి రేపు థియేటర్స్ లో అసలు ఏ మేరకు ఎంతమందిని మెప్పిస్తాడో చూడాలి.