వెంక‌టేష్ కు షాకిచ్చిన షారుక్

Last Updated on by

అదేంటి.. వెంక‌టేష్ ఎక్క‌డ‌.. షారుక్ ఎక్క‌డ‌.. ఈ ఇద్ద‌రికి ఎక్క‌డ పొంత‌న కుదిరింది షాక్ ఇవ్వ‌డానికి అనుకుంటున్నారా..?  ఇండ‌స్ట్రీ ఏదైనా ఒక్కోసారి కామ‌న్ షాకులు అలా వ‌స్తుంటాయంతే. ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా ఇలాంటిదే వెంకీకి ఇచ్చాడు. సాధార‌ణంగానే తెలుగులో వెంక‌టేష్ కు రీమేక్ రాజా అనే పేరుంది. ఎక్క‌డ ఏ భాష‌లో మంచి సినిమా క‌నిపించినా వెంట‌నే తెలుగులోకి తెచ్చేస్తుంటాడు ఈ హీరో. అలాగే ఈయ‌న చూపులు త‌మిళ సినిమాల విక్ర‌మ్ వేధాపై ప‌డ్డాయి. ఏడాది కింద విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టించింది. విజ‌య్ సేతుప‌తి, మాధ‌వ‌న్ హీరోలుగా వ‌చ్చిన ఈ చిత్రాన్ని గాయ‌త్రి పుష్క‌ర్ ద్వ‌యం తెర‌కెక్కించారు.

ఇదే సినిమాను తెలుగులో రానా, వెంకీల‌తో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేసారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అది కుద‌ర్లేదు. ఇప్పుడు తెలుగు కంటే ముందు హిందీలోకి వెళ్తుంది ఈ చిత్రం. అక్క‌డ షారుక్ ఖాన్ విక్ర‌మ్ వేధాపై క‌న్నేసాడు. ఈ చిత్ర రీమేక్ లో విజ‌య్ సేతుప‌తి క‌నిపించిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో షారుక్ న‌టించ‌బోతున్నాడు. ఒరిజిన‌ల్ ను రూపొందించిన గాయ‌త్రి పుష్క‌ర్లే ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. మాధ‌వ‌న్ త‌న ఒరిజిన‌ల్ రోల్ చేస్తున్నాడు. మొత్తానికి వెంకీ కంటె ముందే షారుక్ ప‌ని ముగించేస్తున్నాడు.

User Comments