ఆ పుకార్ల వెన‌క ఎవ‌రున్నారు?

Last Updated on by

టాలీవుడ్ అగ్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌పై ర‌క‌ర‌కాల పుకార్లు షికారు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భ‌ర‌త్ అనే నేను చిత్రానికి టెక్నీషియ‌న్లు, క‌థానాయిక పారితోషికం దాన‌య్య ఎగ్గొట్టార‌న్న ప్ర‌చారం సాగింది. అయితే తాను ఎవ‌రి పారితోషికాలు ఎగ్గొట్ట‌లేద‌ని, ఇలాంటివి ప్ర‌చారం చేసే ముందు డి.వి.వి సంస్థ‌ను సంప్ర‌దించాల‌ని మీడియా ముఖంగా కోరారు. అంతేకాదు త‌న నిర్మాత‌పై భ‌ర‌త్ అనే నేను క‌థానాయిక కియ‌రా అద్వాణీ క్లీన్ చిట్ ఇస్తూ ఆ ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని, అవ‌న్నీ రూమ‌ర్లు మాత్ర‌మేన‌ని కొట్టి పారేసింది. ఒకే బ్యాన‌ర్‌లో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నానంటే నిజాయితీగా ఉండ‌డం వ‌ల్ల‌నేన‌ని త‌న నిర్మాత దాన‌య్య‌కు స‌ర్టిఫికెట్ ఇచ్చింది. కియరా ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌- బోయ‌పాటి- దాన‌య్య సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే అస‌లింత‌కీ ఈ పుకార్ల వెన‌క ఎవ‌రున్నారు? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ ప‌రిశ్ర‌మ‌లో సాగుతోంది. దీని వెన‌క ఏదో కుట్ర దాగి ఉంది. ఇంకెవ‌రో తెర‌వెన‌క ఉండి క‌థ న‌డిపిస్తున్నారు. వ‌రుస‌గా భారీ సినిమాలు నిర్మిస్తున్న దాన‌య్య‌పై ఇంకేదో జ‌రుగుతోంది అంటూ ప‌లువురు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ మొత్తం కుట్ర వెన‌క ఓ పెద్ద స్టార్‌కి స‌న్నిహితులు ఉన్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఆ స్టార్‌కి తెలియ‌కుండానే ఇలా ఒక నిర్మాత‌పై స‌ద‌రు వ్య‌క్తులు దుష్ప్ర‌చారానికి తెగ‌బ‌డ్డార‌న్న విశ్లేష‌ణ జోరందుకుంది. మొత్తానికి అస‌లు దాన‌య్య వెన‌క ఏం జ‌రుగుతోందో ఎవ‌రికీ తెలీని ప‌రిస్థితి. అస‌లింత‌కీ ఎవ‌రున్నారు ఈ గ్యాంబ్లింగ్‌లో?

User Comments