బెల్లంకొండ‌-2 ద‌స‌రా నుంచి మొద‌లు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త‌మ్ముడు, నిర్మాత సురేష్ రెండ‌వ కుమారుడు గ‌ణేష్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. కొన్ని నెల‌లు గ‌డుస్తోన్న దానిపై ఎలాంటి అప్ డేట్ రాలేదు తాజాగా గ‌ణేష్ ప‌రిచ‌య వివ‌రాలు లీక్ అయ్యాయి. ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో గ‌ణేష్ సినిమా ఖారారైందిట‌. దీన్ని బెక్కం వేణుగోపాల్-సురేష్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారుట‌. ద‌స‌రా కానుగా సినిమా ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారుట‌. ఇది రొమాంటిక్ ల‌వ్ స్టోరీ అని స‌మాచారం. క‌థ‌కు త‌గ్గ‌ట్టు గ‌ణేష్ సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు ఛాయిస్ గ‌ణేష్‌- బెక్కం సంయుక్తంగా తీసుకున్న నిర్ణ‌జ్ఞం అని తెలుస్తోంది.

గ‌తంలో ప‌వ‌న్ సాధినేని బెక్కం బ్యాన‌ర్లో ఓ హిట్ ఇచ్చాడు. త‌ర్వాత చేసిన కొన్ని సినిమాల‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందు కున్నాడు. రొటీన్ కు భిన్నంగా ఆలోచిస్తాడు. ఆ న‌మ్మ‌కంతోనే బెల్లంకొండ‌-2ని ప‌వ‌న్ చేతిలో పెట్టిన‌ట్లు తెలుస్తోంది. గ‌ణేష్ కి ప్రొడ‌క్ష‌న్ లో మంచి అనుభ‌వం ఉంది. తండ్రి నిర్మించిన ప‌లు సినిమాల‌కు స‌హాయంగా నిలిచాడు. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌గా రాణిస్తార‌నుకున్నారంతా. కానీ హీరోగానే ఎంట్రీ ఇచ్చి షాకిస్తున్నాడు. ప్ర‌స్తుతం సాయి శ్రీనివాస్ హీరోగా కొన‌సాగుతున్నాడు. ఇటీవ‌లే రాక్ష‌సుడుతో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.