తేజ‌కు షాకిచ్చిన బెల్ల‌కొండ‌

Last Updated on by

బెల్ల‌కొండ సాయిశ్రీనివాస్ క‌థానాయకుడిగా, కాజ‌ల్ హీరోయిన్ గా తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సీత ఈనెల 24న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. గత కొన్నేళ్ల‌గా స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతోన్న సాయికి హిట్ కీల‌కం. ఆశ‌ల‌న్నీ ఈసినిమాపైనే ఉన్నాయి. రిలీజ్ కు ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉండ‌టంతో? ప‌్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ సంద‌ర్భంగా సీత విశేషాల‌ను మీడియాతో పంచు కున్నా డు. అవేంటో ఆయ‌న మాట‌ల్లోనే…

ప్ర‌తీ ఒక్క‌రు జీవితంలో నిజాయితీగా ఉండాల‌ని చెప్పేరోల్ నాది. బాగా చ‌దువుకున్న వాడిని కూడా. ఇలా హ్యాపీగా సాగిపోతున్న జీవితంలో సీత ఎదురైతే ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కున్నాను అన్న‌దే క‌థ‌. మ‌రి ఇది సీత టైటిల్? క‌థ ఎక్కువ‌గా ఆమె చుట్టూ తిరుగుతుందా? అని ప్ర‌శ్నిస్తే నాకు మంచి నటుడిగా నిరూపించుకోవాలని ఉంది. కాబట్టి హీరోయిన్ పాత్ర పేరు టైటిల్ గా గల మూవీలో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాది మంచి పాత్ర అని నాకు పూర్తి నమ్మకం ఉంది. షూటింగ్ జరిగినన్నాళ్లు ఏనాడూ నేను ఇది కాజల్ కి ప్రాధాన్యం ఉన్న సినిమా అని ఫీల్ కాలేదు. పాత్ర న‌చ్చితే ఏ సినిమా అయినా చేస్తాను. తేజ మొద‌టి రోజు పెద్ద సీన్ పేప‌ర్ ఇచ్చి రెడీ అవ్వ‌మ‌న్నారు. ఇయనేంటి ఇంత పెద్ద‌ది చేతిలో పెట్టాడ‌నుకున్నా. కంగారు ప‌డ్డాను. కానీ నా కార్వాన్ లోకి వెళ్లి సీన్ చదుకుని వ‌చ్చి సింగిల్ టేక్ చేసి తేజ‌కు షాకిచ్చా. నిజం సినిమాకు ఈ క‌థ‌కు పోలిక‌లున్నాయంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఇది కొత్త క‌థ‌. పాత క‌థ‌ల‌ను అనుక‌రించి సినిమాలు చేసే అల‌వాటు తేజ కి లేద‌ని ఖండించాడు.

User Comments