బెల్లంకొండ-తేజ‌ టైటిల్ ఇదే

Last Updated on by

బెల్లంకొండ శ్రీ‌నివాస్ స్పీడుమీదున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఒక సినిమా సెట్స్‌లో వుంటే మ‌రో సినిమా జోలికి వెళ్ల‌ని ఈ గోల్డ్ స్పూన్ హీరో ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్ని లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒక‌టి కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ల‌తో వంశ‌ధార క్రియేష‌న్స్ నిర్మిస్తున్న `క‌వ‌చం`. మ‌రొక‌టి తేజ రూపొందిస్తున్న సినిమా. ఈ రెండింటిలో శ్రీ‌నివాస్ తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన `క‌వ‌చం` నేడు ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ రెండు చిత్రాల్లోనూ కాజ‌ల్‌ హీరోయిన్‌. త‌న‌దే కీరోల్‌.

`క‌వ‌చం` రిలీజ‌వుతున్న వేళ బెల్లంకొండ శ్రీనివాస్- తేజ‌ల తొలి క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమాకు సంబంధించిన వార్త ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చేసింది. `నేనే రాజు నేను మంత్రి` సినిమాతో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన తేజ త‌న ల‌క్కీ మ‌స్క‌ట‌ర్‌గా భావిస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ నే తాజా చిత్రానికి న‌మ్ముకున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే కాజ‌ల్ ప్ర‌ధానంగా సాగే క‌థ‌ని తేజ ఈ చిత్రం కోసం ఎంచుకున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌న్నారా చోప్రా మ‌రో నాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నాడు. క‌థానాయిక చుట్టూ తిరిగే క‌థ కావ‌డంతో ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు తేజ `సీత‌` అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న చుట్టూ తిరిగే క‌థ‌ల్లో న‌టిస్తూ వ‌స్తున్న బెల్లంకొండ శ్రీ‌నివాస్‌కు ఈ సినిమాతో తేజ కొత్త బాట‌ను వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. `ఎన్టీఆర్‌` బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్న తేజ ఈ చిత్రాన్ని సైలెంట్‌గా మొద‌లుపెట్టి చ‌క‌చ‌కా ప‌రుగులెట్టిస్తున్నాడు. ఇప్ప‌టికే 80 శాతం షూటింగ్ పూర్తి చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుండ‌గా డిసెంబ‌ర్‌లో మిగ‌తా బ్యాలెన్స్ షూటింగ్‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రితో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్ని ముగించి చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

User Comments