ఇది బెల్లంకొండ `క‌వ‌చం`

Last Updated on by

తెలుగు తెర‌పై ఖాకీల‌కు కొద‌వేం లేదు. స్టార్ హీరోలంతా ఖాకీలు తొడిగారు. హిట్టు కొట్టారు. న‌వ‌త‌రం హీరోలు ఖాకీలతో మైమ‌రిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ కోవ‌లోనే న‌వ‌త‌రం హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఓ హిట్టు కోసం వేచి చూస్తున్న వేళ ఖాకీనే న‌మ్ముకున్నాడు. ఎంద‌రో స్టార్ల‌కు అచ్చొచ్చిన ఖాకీ అస్త్రం త‌న‌కు కూడా క‌లిసొస్తుంద‌న్న ధీమాతో అత‌డు భారీ ఛాలెంజ్‌నే స్వీక‌రించాడు.

అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రానికి `క‌వ‌చం` అనే టైటిల్‌ని ప్ర‌క‌టించారు. ఈ చిత్రంతో శ్రీ‌నివాస్ మామిళ్ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కాజ‌ల్, మెహ్రీన్ ఈ చిత్రంలో క‌థానాయికలుగా ఆడి పాడుతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన క‌వ‌చం పోస్ట‌ర్‌లో బెల్లంకొండ ప‌వ‌ర్‌ఫుల్ కాప్ అవ‌తారంలో క‌నిపిస్తున్నాడు. తీర్చిదిద్దిన దేహ‌శిరులు.. తీరైన కండ‌బ‌లం ఖాకీకి బాగానే సెట్టయ్యింది. అయితే పోస్ట‌ర్‌లో క‌నిపించినంత ప‌వ‌ర్‌ఫుల్‌గా కంటెంట్‌లోనూ మ్యాట‌ర్ ఉంటే మాత్రం అత‌డికి కావాల్సిన హిట్టొస్తుంద‌న‌డంలో సందేహం లేదు. డిసెంబ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామ‌ని ఫ‌స్ట్‌లుక్‌లోనే ప్ర‌క‌టించారు. వంశ‌ధార క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

User Comments