నిర్మాత తనయుడు మంచి జోరు మీదున్నాడు

Last Updated on by

ఇండ‌స్ట్రీకి ఎలా వ‌చ్చాం అనేది కాదు.. ఇప్పుడు ఎలా ఉన్నాం.. ఎలా దూసుకెళ్తున్నాం అనేది ముఖ్యం. నిర్మాత‌ల త‌న‌యులు హీరోలుగా నిల‌బ‌డ‌రు అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసి వెంకటేష్, జ‌గ‌ప‌తిబాబు స్టార్స్ అయ్యారు. ఇప్పుడు వీళ్ల బాట‌లోనే న‌డ‌వ‌డానికి బెల్లంకొండ శ్రీ‌నివాస్ కూడా తోడు అయ్యాడు. ఈయ‌న తొలి సినిమా నుంచి ఒక్క హిట్ అంటూ కోరుకుంటున్నాడు. అలాగ‌ని అన్నీ ఫ్లాపులే ఉన్నాయా అంటే అదీ కాదు. అన్నీ కోరి తెచ్చుకున్న ప్లాపులే. అదెలా అంటారా.. అల్లుడు శీను సినిమా ఉంది. అది సాధారణంగా అయితే హిట్ సినిమానే. ఎందుకంటే ఎలాంటి యాక్టింగ్ బ్యాగ్రౌండ్ లేని కొత్త హీరోతో వినాయ‌క్ సినిమా తీస్తే అది 25 కోట్లు వ‌సూలు చేసింది. కానీ ఏం చేస్తాం.. కొడుకు కోసం 40 కోట్లు ఖ‌ర్చు చేసాడు బెల్లంకొండ‌. దాంతో సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్. ఇక రెండో సినిమా స్పీడున్నోడు అడ్ర‌స్ లేకుండా పోయింది.

మూడోది మ‌ళ్లీ భారీ సినిమానే. బోయ‌పాటి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తో జ‌య జాన‌కీ నాయ‌కా చేసాడు. ఇది కూడా బాగుంది. ఈ సినిమాకు కూడా మ‌రో 25 కోట్లు వ‌సూలు చేసింది. కానీ ఇక్క‌డ‌ కూడా సేమ్ ప్రాబ్ల‌మ్. బ‌డ్జెట్ ఎక్కువ‌. దాంతో మ‌నోడికి హీరోగా గుర్తింపు అయితే వ‌చ్చింది కానీ విజ‌యం మాత్రం రావ‌ట్లేదు. ఇప్పుడు ఈయ‌న సాక్ష్యం సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా త‌న కెరీర్ లో విజ‌యానికి సాక్ష్యంగా నిలుస్తుంద‌ని భావిస్తున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. మే 11న సినిమా విడుద‌ల కానుంది. పూజాహెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే మ‌రో సినిమాకు ఓకే చెప్పాడు బెల్లంకొండ‌. శ్రీ‌నివాస్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 22న లాంఛ్ కానుంది. కాజ‌ల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీనికోసం ఆమెకు రెండు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో కొత్త నిర్మాత న‌వీన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఏదేమైనా బెల్లంకొండ వార‌సుడు టాప్ గేర్ లో దూసుకెళ్లిపోతున్నాడు. ఇదే ఏడాది శ్రీ‌నివాస్ సినిమా కూడా విడుదల‌ కానుంది. మొత్తానికి.. బెల్లంకొండ టైటిల్ కు త‌గ్గ‌ట్లే స్పీడున్నోడు అనిపించుకుంటున్నాడు.

User Comments