బెల్లంకొండకి కాశీనాథుడే సాక్ష్యం…

ఇండ‌స్ట్రీలో కొంద‌రు వార‌సులు ఉంటారు. వాళ్ల‌కు హిట్టు ఫ్లాపుల‌తో ప‌నిలేదు. వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ కూడా అంతే. మూడేళ్ల కింద అల్లుడుశీనుతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు ఈ వార‌సుడు. స్టార్ హీరోల త‌న‌యుల‌కు కూడా ద‌క్క‌ని ఘ‌న‌మైన లాంఛింగ్ ఈ కుర్రాడికి ద‌క్కింది. అల్లుడుశీను ఏకంగా 40 కోట్ల‌తో నిర్మించాడు బెల్లంకొండ సురేష్. ఈ చిత్రం ఓవ‌ర్ బ‌డ్జెట్ కార‌ణంగా ఫ్లాప్ అయింది కానీ ఈ కుర్రాడికి మాత్రం బాగానే గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత స్పీడున్నోడు చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో జ‌య జాన‌కి నాయ‌కా సినిమా చేసాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. ఈ చిత్రం కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది కానీ ఈ కుర్రాడి కెరీర్ కు బాగానే హెల్ప్ అయింది. ఫుల్ ర‌న్ లో జ‌య జాన‌కి నాయ‌కా 23 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది.
జ‌య జాన‌కీ నాయ‌కా సెట్స్ పై ఉన్న‌పుడే.. ల‌క్ష్యం ఫేమ్ శ్రీ‌వాస్ తో సినిమాకు క‌మిట‌య్యాడు శ్రీ‌నివాస్. ఇది చాలా కొత్త కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతోంది. ఇందులో వీడియో గేమ్స్ త‌యారు చేసే పాత్ర‌లో న‌టిస్తున్నాడు బెల్లంకొండ‌. చిన్న‌పుడే అమ్మానాన్న‌ల్ని పోగొట్టుకున్న పాత్ర ఇది. దీనికి సాక్ష్యం అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. పైగా శ్రీ‌వాస్ కు ల‌క్ష్యం.. లౌక్యం.. లాంటి రెండ‌క్ష‌రాల టైటిల్స్ బాగా క‌లిసొచ్చాయి. ఈ మ‌ధ్యే పొల్లాచ్చిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని వ‌చ్చిన టీం.. ఇప్పుడు కాశీలో యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. దీనికోసం ఆమెకు కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు నేను లోక‌ల్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన త్రినాథ‌రావ్ న‌క్కిన‌తో బెల్లంకొండ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. మొత్తానికి బెల్లంకొండ వార‌సుడు టాప్ గేర్ లో దూసుకెళ్లిపోతున్నాడు.