పీట‌ర్‌హెయిన్‌నే ప్ర‌శ్నించాడు

Last Updated on by

ఇండ‌స్ట్రీలో ఎవ‌రైనా ఓ సీనియ‌ర్ ముందు త‌లెత్తి మాట్లాడాలంటే చిన్నా చిత‌కా వాళ్లు ఎంతో భ‌య‌ప‌డుతుంటారు. అలాంటిది ఈ యంగ్ హీరో మాత్రం అస్స‌లు ఏ బెరుకూ లేకుండా దూకుడు చూపిస్తుండ‌డం చ‌ర్చ‌కొచ్చింది. గ్రేట్ ఫైట్ మాష్ట‌ర్ పీట‌ర్‌హెయిన్ ముందే డేరింగ్‌గా మాట్లాడేసిన గ‌ట్స్ గురించి చ‌ర్చ‌కొచ్చింది. అస‌లింత‌కీ ఎవ‌రీ హీరో అంటే బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌.

అస‌లింత‌కీ ఏ విష‌యంలో అంటే.. మ‌రో మూడురోజుల్లో రిలీజ్‌కి వ‌స్తున్న సాక్ష్యం గురించి మాట్లాడుతూ బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఓ సంగతి చెప్పాడు. ఈ సినిమాలో ప్ర‌తి ఫైట్ క్లైమాక్స్ ఫైట్‌లా ఉంటుంద‌ని, సాహ‌సాలెన్నో క‌ట్టి ప‌డేస్తాయ‌ని అన్నాడు. ఓ అడ్వెంచ‌ర్ కోసం కొంత ట్రైనింగ్ తీసుకున్నాన‌ని తెలిపాడు. దుబాయ్‌కి వెళ్లి శాండ్ బోడింగ్, ఫై బోడింగ్, బీఎంఎస్ సైక్లింగ్, ఏపీవీ రైడింగ్ లాంటి అంశాలలో ట్రైనింగ్ తీసుకున్నాడ‌ట‌. అయితే ఫైటింగుల కోసం అస్స‌లు రిస్క్ చేయొద్ద‌ని పీటర్ హెయిన్స్ వారించే ప్ర‌య‌త్న ం చేశాడుట‌. మగధీర టైమ్‌లో త‌న యాక్సిడెంట్ గురించి చెప్పి భ‌యపెట్టాడ‌ట‌. అయితే ఆ టైమ్‌లో బెల్లంకొండ అంతే ధీటుగా స్పందించాడు. మగధీరలో రిస్క్ చేయకపోతే బాహుబలి ఛాన్స్‌ వచ్చేదా? అని పీటర్ మాస్టర్‌ను ప్ర‌శ్నించాను. కొత్తగా ఏదైనా చేయకపోతే ప్ర‌త్యేక‌త ఏం ఉంటుంది అని ప్ర‌శ్నించాన‌ని తెలిపాడు. నిజ‌మే బెల్లంకొండ పాయింట్‌ని క్యాచ్ చేయాల్సిందే. ఏ రంగంలో అయినా రాణించాలంటే డేరుండాలి. గ‌ట్స్ చూపించాలి. లేక‌పోతే ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే! అయితే ఇన్నాళ్లు ఒక్క హిట్ట‌యినా రాని బెల్లంకొండ‌కు సాక్ష్యం అయినా హిట్ట‌వుతుందేమో చూడాలి.

User Comments