సాక్ష్యం లేని నిజం కొడుకు కోసమే

Last Updated on by

పైకి క‌నిపించ‌డు కానీ బెల్లంకొండ శ్రీ‌నివాస్ మాత్రం చాలా ముదురే. ప్ర‌తీ సినిమాలోనూ స్టార్ హీరోయిన్ల‌తో జోడీ క‌డుతూ త‌న రేంజ్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన అన్ని సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్ల‌తోనే రొమాన్స్ చేస్తూ వ‌చ్చాడు ఈ కుర్ర హీరో. స్పీడున్నోడులో సోనారిక‌తో జోడీక‌ట్టినా.. అదే సినిమాలో త‌మ‌న్నాతో ఐటం సాంగ్ చేసాడు ఈ హీరో. ఇక ఇప్పుడు పూజాహెగ్డేతో సాక్ష్యం చెప్ప‌బోతున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యింది. ముందు ఈ చిత్రాన్ని మార్చ్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు ఏకంగా మే 11కి సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. పేరుకు అభిషేక్ క‌నిపిస్తున్నా.. తెర‌వెన‌క మాత్రం బెల్లంకొండ సురేష్ హ‌స్తం ఉంద‌ని తెలుస్తుంది. త‌న‌యున్ని స్టార్ గా నిల‌బెట్ట‌డానికి ప్ర‌తీ సినిమాను కూడా భారీ బ‌డ్జెట్ తోనే నిర్మిస్తున్నాడు ఈ నిర్మాత‌. ఇది సాక్ష్యం లేని నిజం.

ఎలాగైనా త‌న వార‌సున్ని స్టార్ హీరోను చేసి త‌న ఉనికిని చాటుకోవాల‌ని చూస్తున్నాడు బెల్లంకొండ సురేష్. సాక్ష్యం సినిమాపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ క‌థ‌లో హీరోకు పంచ‌భూతాలే సాక్ష్యంగా నిల‌బ‌డ‌తాయి. అదే ఆయ‌న‌కు బ‌లం కూడా. ఫిదా ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 26న మ‌హేష్, బ‌న్నీ సినిమాలు వ‌స్తున్నాయి. అవి ఒక‌వేళ వారం రోజులు పోస్ట్ పోన్ అయినా కూడా త‌న సినిమాకు ఇబ్బంది క‌ల‌గ‌కుండా రెండు వారాలు గ్యాప్ ఇచ్చి వ‌స్తున్నాడు బెల్లంకొండ వార‌సుడు. అక్క‌డే త‌న తెలివితేట‌ల‌ను చూపించాడు ఈ హీరో. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు కానీ తొలి విజ‌యం మాత్రం అందుకోలేక‌పోయాడు ఈ కుర్ర హీరో. మరి సాక్ష్యంతో నైనా హిట్ అందుకోవాలని ఆశిద్దాం.

User Comments