అక్టోబ‌ర్ నుంచి మందు బంద్

Who is in Jagan's Mind for APFDC Chairman Post?

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహాన్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటి నుంచి జ‌గ‌న్ అన్ని ప‌నుల‌ను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే ప‌నిలో ప‌డ్డారు. త‌న‌తో పాటు మంత్ర‌లును ప‌రుగుల పెట్టించి మ‌రీ ప‌నులు చేయిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికే రాష్ర్ట అభివృద్ది కోసం కోసం కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తండ్రి త‌ర‌హాలోనే త‌న‌యుడు పాల‌న ఆరంభంలోన ఔరా అనిపించారు. అవినీతి లేని పాల‌న‌, ఎడ్యుకేష‌న్ సిస్ట‌మ్ లో స‌మూలంగా మార్పులు దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ఇక మందు బాబుల‌కు షాక్ ఇస్తూ బెల్డు షాపులు మూసి వేయ‌డానికి రంగం సిద్ద‌మైంది. అక్టోబ‌ర్ 1 క‌ల్లా రాష్ట్ర్లంలో అన్ని జిల్లాల్లో బెల్టుషాపులు మూసివేయాల‌ని జిల్లాల కలెక్ట‌ర్ల‌కు, ఎస్పీల‌కు ఆదేశాలు జారీ చేసారు. సమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో ఆల‌స్యం లేకుండా ముందుకు వెళాల్సిందేన‌ని సంక‌ల్పించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు క‌నిపించ‌కూడ‌దు. దాబాల్లో లిక్కర్‌ అమ్మకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. త‌న ఆదేశాల‌ను బేఖాత‌రు చేసినా..అదికారులు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోయినా ప‌రిస్థితులే వేరుగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.