భాగ‌మ‌తి అనుష్క‌ది.. కానీ నేను స్వీటీ..

Last Updated on by

ఏంటి క‌న్ఫ్యూజ‌న్ అనుకుంటున్నారా..? ప‌్రీ రిలీజ్ వేడుక‌లో అభిమానులు డైలాగ్ డైలాగ్ అంటూ అరుస్తుంటే అనుష్క చెప్పిన మాట‌లు ఇవి. సినిమాలో ఉన్న‌ది భాగ‌మ‌తి.. అక్క‌డ డైలాగులు చెప్పింది అనుష్క‌.. కానీ ఇప్పుడు ఇక్క‌డ మీ ముందు ఉన్నది స్వీటీ. డైలాగ్స్ అనుష్క చెప్తేనే బాగుంటుంది.. స్వీటీ కాదంది అనుష్క‌. భాగ‌మ‌తి ప్రీ రిలీజ్ వేడుక పుణ్య‌మా అని చాలారోజుల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది అనుష్క‌. చాలా కాలంగా తెర‌వెన‌కే ఉండిపోయిన జేజ‌మ్మ‌.. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు బ‌య‌టికొచ్చింది.

ఈ చిత్ర క‌థ తాను 2012లో విన్నాన‌ని.. అప్ప‌ట్నుంచీ త‌న కోసం వేచి చూసినందుకు నిర్మాత‌లు యువీ క్రియేష‌న్స్ కు థ్యాంక్స్ చెప్పింది అనుష్క‌. అంతేకాదు.. భాగ‌మ‌తి కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌తీ ఒక్క‌రికి పేరు పేరునా అనుష్క ధ‌న్య‌వాదాలు తెలిపింది. సినిమా జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుంది. ఈ ప్రీ రిలీజ్ వేడుక‌కు అల్లుఅర‌వింద్, నాని ముఖ్యఅతిథులుగా వ‌చ్చారు. ఈ సినిమా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని.. ఇది త‌న మ‌న‌సుకు చాలా ద‌గ్గ‌రైన సినిమా అని చెప్పుకొచ్చింది అనుష్క‌. మ‌రి స్వీటీ చెప్పిన‌ట్లుగానే నిజంగానే భాగ‌మ‌తి అంత బాగుంటుందా.. మ‌న‌సుకు హ‌త్తుకుంటుందా లేదా అనేది మ‌రో వారం రోజుల్లో తేలిపోనుంది.

User Comments