భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు మూవీ రివ్యూ

న‌టీన‌టులు: శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
రిలీజ్ తేదీ: 06 డిసెంబ‌ర్ 2019
బ్యాన‌ర్: ఫ‌్ల‌యింగ్‌ కలర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాత‌: శ్రీ‌నివాస‌రెడ్డి
ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస రెడ్డి

ముందు మాట‌:
గీతాంజ‌లి, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా, ఆనందో బ్ర‌హ్మ వంటి చిత్రాల్లో లీడ్ పాత్ర‌లో న‌టించిన క‌మెడియ‌న్ శ్రీ‌నివాస‌రెడ్డి తొలిసారి ద‌ర్శ‌కునిర్మాత‌గా మారి రూపొందించిన చిత్రం `భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు`. త‌న స్నేహితుల స‌హ‌కారంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాన‌ని శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొంది ఈ సినిమా ట్రైలర్ ఆక‌ట్టుకుంది. `జయమ్ము నిశ్చయమ్మురా` రచయిత పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లేను అందించారు. పూర్తి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ చూడాలంటే ఇటీవ‌ల స‌రైన సినిమా క‌నిపించ‌డం లేదు. మ‌రి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌య‌త్నం ఫ‌లించిందా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ స‌మీక్ష‌లోకి వెళ్లాల్సిందే.

క‌థాక‌మామీషు:
ముగ్గురు స్నేహితుల(శ్రీ‌నివాస్ రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్, స‌త్య‌)కు న‌ట‌న అంటే పిచ్చి. క‌నీసం ల‌ఘు చిత్రాల్లో అయినా న‌టించాల‌న్న క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఆ క్ర‌మంలోనే ల‌ఘుచిత్రాల ద‌ర్శ‌కుడు ర‌ఘుబాబు ఓ మెలిక పెడ‌తాడు. ఒక అంద‌మైన హీరోయిన్ ని వెతికి తెస్తేనే ల‌ఘు చిత్రంలో అవ‌కాశం ఇస్తాన‌ని ఆ ముగ్గురికి గోల్ ఫిక్స్ చేస్తాడు. ఆ క్ర‌మంలోనే ఓ డ్ర‌గ్ మాఫియా వ‌ల్ల ఊహించ‌ని ప్ర‌మాదంలో ప‌డిన ఓ లేడీ జ‌ర్న‌లిస్ట్ (డోలిశా) శ్రీ‌నివాస రెడ్డి అత‌డి స్నేహితుల‌కు ప‌రిచ‌యం అవుతుంది. ఆమె ప‌రిచ‌యం త‌ర్వాత ఆ ముగ్గురు స్నేహితులు ఏం చేశారు?  ర‌క‌ర‌కాల మిస్ అండ‌ర్ స్టాండింగ్స్ నుంచి పుట్టుకొచ్చే కామెడీ వ‌ర్క‌వుటైందా లేదా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ క‌థ‌లో వెన్నెల కిషోర్ స్టింట్ ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి.

శ్రీ‌నివాస‌రెడ్డి మంచి కాన్సెప్టునే ఎంచుకున్నా తెర‌కెక్కించిన‌ విధానం ఫెయిలైంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ లో అత‌డి ప‌ట్టు ఎక్క‌డా కనిపించ‌లేదు. ఓవ‌రాల్ గా చూస్తే ఫ‌స్టాఫ్ బోర్. సెకండాఫ్ అక్క‌డ‌క్క‌డా ఫ‌ర్వాలేదు. ర‌స‌గుల్లా సీన్ .. బ‌తుకు జ‌ట్కాబండి సీన్లు వ‌ర్క‌వుట‌య్యాయి. ఓవ‌రాల్ గా నేరేష‌న్ పూర్తిగా ఫెయిల్ అనే చెప్పాలి. క‌మెడియ‌న్లు క‌లిసి చేసిన ప్ర‌య‌త్నంలో కామెడీ కొంత‌వ‌ర‌కే వ‌ర్క‌వుటైతే కుద‌ర‌దు. ఆద్యంతం ర‌క్తి క‌ట్టించాలి. అందులో ఫెయిల‌య్యారు. ఓవ‌రాల్ గా ఇదో పూర్ ఫిలిం అని డిక్లేర్ అయ్యింది.

న‌టీన‌టులు:
శ్రీ‌నివాస‌రెడ్డి త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించాడు. క‌మ‌ల్ హాస‌న్ వ‌సంత కోకిల స్పూఫ్ మిన‌హా న‌టించేందుకు అంతగా చెప్పుకోద‌గ్గ స్కోప్ లేదు. స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ సినిమా ఆద్యంతం మెప్పించారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆ ఇద్ద‌రి న‌ట‌న హైలైట్. ష‌క‌ల‌క శంక‌ర్- బ‌తుకు జ‌ట్కా బండి స్ఫూఫ్ హైలైట్. ప్రీక్లైమాక్స్ లో ర‌స‌గుల్ల ఎపిసోడ్ లో స‌త్య న‌ట‌న క‌డుపుబ్బా న‌వ్వించింది. డోలిశా చెప్పుకోవ‌డానికేం లేదు. పోలీస్ అధికారిగా వెన్నెల కిషోర్ ఓకే. స‌త్యం రాజేష్.. గెట‌ప్ శ్రీ‌ను, హైప‌ర్ ఆది, చిత్రం శ్రీ‌ను, వైవా హ‌ర్ష‌, మ‌హేష్ విట్ట వీళ్ల‌కు న‌టించేంత గొప్ప స్కోప్ క‌థ‌లో లేదు.

టెక్నీషియ‌న్స్:
శ్రీ‌నివాస రెడ్డి న‌టుడిగా వంద‌శాతం ఓకే కానీ ద‌ర్శ‌కుడిగా ఇంకా ఎంతో మెరుగ‌వ్వాల్సి ఉంటుంది. అతడు ఎంచుకున్న క‌థాంశం బావున్నా స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేయ‌లేక‌పోయాడు. నేరేష‌న్ వీక్ గా తేలిపోయింది. ప‌ర‌మ్ డైలాగులు అక్క‌డ‌క్క‌డా పేలాయి. ప‌రిమిత బ‌డ్జెట్ వ‌ల్ల సాంకేతిక విలువ‌లు అంతంత మాత్ర‌మే. సంగీతం-కెమెరా-ఎడిటింగ్ బేసిక్ లెవ‌ల్లో ఓకే.

ముగింపు:
రుచి లేని ర‌స‌గుల్ల‌.. ఎక్క‌డుంది గ‌మ్మ‌త్తు?

రేటింగ్:
1.5/5