రాజ‌శేఖ‌ర్ కూతురు ఏం చేస్తుందో మ‌రి..?

Last Updated on by

ఎవ‌రెన్ని చెప్పినా తెలుగు ఇండ‌స్ట్రీలో మాత్రం వార‌సురాళ్ల‌కు స్కోప్ త‌క్కువే. ఇక్క‌డ వాళ్లు హీరోయిన్లుగా రాణించ‌డం త‌క్కువే. హీరోయిన్ గా వెలిగిపోవాలంటే అందం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. అందాల ఆర‌బోత కూడా చేయాలి. కానీ హీరోల ఫ్యాన్స్ ఆ విష‌యానికి అస్స‌లు ఒప్పుకోరు. అందుకే తెలుగులో వార‌సురాళ్ల హ‌వా త‌క్కువ‌గా క‌నిపిస్తుంది మ‌న‌కు. ఈ మ‌ధ్యే కొంద‌రు వ‌చ్చినా కూడా ఎవ‌రూ స్టార్ అయితే కాలేదు. అంతా కెరీర్ కోసం పాట్లు ప‌డుతున్న వాళ్లే. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ కూడా వ‌చ్చేస్తుంది. తెలుగుతో పాటు తమిళ ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ భామ‌ ప‌రిచ‌యం కానుంది. ఇప్ప‌టికే తెలుగులో అడ‌వి శేష్ తో క‌లిసి 2 స్టేట్స్ రీమేక్ లో న‌టించ‌బోతుంది శివానీ. ఈ సినిమా ఉగాది సంద‌ర్భంగా ప‌ట్టాలెక్క‌నుంది.Bhagyashree Re entry With Jeevitha Daughter Shivani rajasekhar Movieజీవిత కూడా త‌న కూతుళ్ల‌ను స్టార్ హీరోయిన్లుగా మార్చ‌డానికి ఎత్తులు బాగా వేస్తుంద‌ని తెలుస్తోంది. ఒకప్పటి హీరోయిన్ అయిన భాగ్య శ్రీ ని ఈ సినిమాలో అమ్మ క్యారెక్టర్ కి తీసుకొన్నారు. ఇక అన్నింటికీ సిద్ధ‌పడే ఇండ‌స్ట్రీకి రావ‌డానికి శివానీ రాజ‌శేఖ‌ర్ రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. అయినా జీవిత‌కు తెలియ‌ని ఇండ‌స్ట్రీనా ఇది. గ్లామ‌ర్ షో లేక‌పోతే స్టార్ డాట‌ర్ అయినా.. ఎవ‌రైనా ఇంటి ముఖం ప‌ట్టాల్సిందే. అందుకే కూతుళ్ల‌కు ఫుల్ గా ఫీడింగ్ ఇచ్చి రంగంలోకి దింపుతుంది ఈ మాజీ హీరోయిన్. తెలుగులో ఇంకా సినిమా ప‌ట్టాలెక్క‌నే లేదు అప్పుడే త‌మిళ్ నుంచి కూడా ఆఫ‌ర్ వ‌చ్చింది ఈ భామ‌కు. అక్క‌డ విష్ణువిశాల్ తో క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌బోతుంది. మొత్తానికి మ‌రి శివానీ రాజ‌శేఖ‌ర్ కెరీర్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

 

User Comments