జీఎస్టీ సాక్షిగా 161 కోట్లు!

Last Updated on by

`భ‌ర‌త్ అనే నేను` తొలి వారం దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగుపెట్టింది. మొద‌టి వారంలో ఏకంగా 161 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింద‌ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అంటూ డి.వి.వి.సంస్థ కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌డం విశేషం.
అయితే ఎవ‌రికి వారు సామాజిక మాధ్య‌మాల్లో, అంత‌ర్జాలంలో భ‌ర‌త్ వ‌సూళ్ల గురించి కాకి లెక్క‌లు చెప్పేస్తున్నార‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. కొంద‌రు ఇంకా ఈ సినిమా 150 కోట్ల గ్రాస్‌, 100 కోట్ల షేర్‌ని క్రాస్ చేయ‌లేద‌ని డిబేట్ న‌డిపిస్తున్నారు. ఇత‌ర హీరోల ఫ్యాన్స్ అయితే కాకి లెక్క‌లు అని కొట్టి పారేస్తున్నారు కూడా. అయితే ఇలాంటి క‌న్ఫ్యూజ‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకా అన్న‌ట్టు డి.వి.వి సంస్థ అధికారికంగా వ‌ర‌ల్డ్ వైడ్‌ 161.28 కోట్లు వ‌సూళ్లు సాధించాం అంటూ పోస్ట‌ర్‌పై `రాజ‌మౌళి రాజ‌ముద్రలా` వేసి అధికారిక ట్విట్ట‌ర్‌లో ఆ పోస్ట‌ర్‌ని షేర్ చేసింది. అంటే ఆ మేర‌కు అధికారికంగా జీఎస్టీ చెల్లించేందుకు డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్ణ‌యించుకున్న‌ట్టేన‌ని అభిమానుల్లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. వ‌సూళ్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాదు, జీఎస్టీ అంతే నిజాయితీగా చెల్లించాల్సి ఉంటుంద‌న్న‌ది ఫ్యాన్స్ లో హాట్ డిబేట్ ఇప్పుడు.

User Comments