భ‌ర‌త్‌కి మ‌న్యంపులి సాయం

Last Updated on by

మ‌హేష్ -కొర‌టాల కాంబినేష‌న్‌ బంప‌ర్‌హిట్ మూవీ `భ‌ర‌త్ అనే నేను`. తెలుగు వెర్ష‌న్‌ దాదాపు 200కోట్ల గ్రాస్‌, 100కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అయితే ఈ సినిమా మ‌ల‌యాళంలో అంత పెద్ద హిట్ అవుతుందా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌హేష్‌కి మ‌ల‌యాళంలో బ‌న్నికి ఉన్నంత ఫాలోయింగ్ లేక‌పోయినా.. అత‌డు అంత‌కంత‌కు గ్రాఫ్ పెంచుకునేందుకు సీరియ‌స్‌గానే క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. ఇటీవ‌ల మహేష్ మ‌ల‌యాళీ అభిమాన సంఘాలు ప్ర‌చారంలో స్పీడ్‌గానే ఉంటున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే `భ‌ర‌త్ అనే నేను` చిత్రాన్ని కేర‌ళ‌లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మ‌ల‌యాళంలో సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ స్నేహితుడు శిబు త‌మీన్స్ రిలీజ్ చేస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. శిబుకి మాలీవుడ్ ట్రేడ్‌లో గొప్ప పేరుంది. ఆయ‌న అక్క‌డ అగ్ర నిర్మాత కం పంపిణీదారు కావ‌డంతో భ‌రత్ అనే నేను చిత్రానికి గ్రాండ్ రిలీజ్ ల‌భించింద‌ని చెబుతున్నారు. అప్ప‌ట్లో మాలీవుడ్‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించి 100కోట్లు వ‌సూలు చేసిన `మ‌న్యంపులి` (పులి మురుగ‌న్‌) చిత్రాన్ని శిబు స్వ‌యంగా నిర్మించారు. ఎబిసిడి, సామి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను ఆయ‌న‌ నిర్మించారు. ప్ర‌స్తుతం `భ‌ర‌త్ అనే నేను` మ‌ల‌యాళ వెర్ష‌న్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా మే 31న కేర‌ళ‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. భ‌ర‌త్‌కి మ‌న్నెంపులి సాయం మ‌ల‌యాళీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ అక్క‌ర‌కొస్తుందేమో చూడాలి.

User Comments